బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీ.వీ.
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2023 (12:49 IST)

సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మల ఊరు పేరు భైరవకోన అప్డేట్

Sandeep Kishan, Varsha Bollammala
Sandeep Kishan, Varsha Bollammala
హీరో సందీప్ కిషన్, డైరెక్టర్ వీఐ ఆనంద్ ఫాంటసీ అండ్ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ 'ఊరు పేరు భైరవకోన' విడుదలకు సిద్ధమవుతోంది. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషన్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచగా..  ఫస్ట్ సింగిల్‌ 'నిజమే చెబుతున్న' చార్ట్ బస్టర్ హిట్ గా నిలిచింది. మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో  కొనసాగుతోంది. తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ తో వచ్చారు. 'ఊరు పేరు భైరవకోన'సెకండ్ సింగిల్ హమ్మా హమ్మా ఈ నెల 28న విడుదల కానుంది. సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో లీడ్ పెయిర్ సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ లవ్లీ అండ్ గ్రేస్ ఫుల్ గా కనిపించారు.

కావ్య థాపర్ మరో కథానాయిక గా నటిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తున్నారు. రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, ఎ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్. భాను భోగవరపు, నందు సవిరిగాన ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు.