శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : ఆదివారం, 27 డిశెంబరు 2020 (16:12 IST)

సందీవ్ మాధవ్ "గంధర్వ" మూవీ షూటింగ్ ప్రారంభం

'వంగవీటి, 'జార్జిరెడ్డి' చిత్రాలతో తానేంటో ప్రూవ్ చేసుకొని ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెర్సటైల్ యాక్టర్ సందీప్ మాధవ్ హీరోగా గాయత్రి ఆర్.సురేష్, అక్షత శ్రీనివాస్ హీరోయిన్స్‌గా యస్ అండ్ యమ్ క్రియేషన్స్, వీరశంకర్ సిల్వర్ స్క్రీన్స్ పతాకాలపై అప్సర్ దర్శకత్వంలో యం యన్ మధు నిర్మిస్తున్న చిత్రం "గంధర్వ". ఈ చిత్రం ప్రారంభోత్సవం డిసెంబర్ 27న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా ప్రారంభమైంది. 
 
సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్, క్రిష్, హీరో శ్రీకాంత్, సాయికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం హీరో సందీప్ మాధవ్, హీరోయిన్ అక్షత శ్రీనివాస్‌పై చిత్రికరించిన ముహూర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్ నివ్వగా శ్రీకాంత్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు క్రిష్ గౌరవ దర్శకత్వం వహించారు. 
 
అనంతరం ఏర్పాటైన మీడియా సమావేశంలో హీరో సందీప్ మాధవ్, హీరోయిన్ అక్షత శ్రీనివాస్, దర్శకుడు అప్సర్, ప్రముఖ నటులు సురేష్, బాబుమోహన్, ఆదర్శ్, కెమెరామెన్ జవహర్ రెడ్డి, సంగీత దర్శకుడు రాప్ రాక్ షకీల్, వీరశంకర్, నిర్మాత యం. యన్. మధు పాల్గొన్నారు.
 
వీరశంకర్ సిల్వర్ స్క్రీన్స్ అధినేత వీరశంకర్ మాట్లాడుతూ... మంచి సెన్సిబిలిటీస్ ఉన్న డైరెక్టర్ అప్సర్. ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ గంధర్వ అనే అద్భుతమైన కథని రెడీ చేశాడు. కొత్తగా మంచి సినిమా తియ్యాలన్న కసి, ఫ్యాషన్ ఉన్న డైరెక్టర్ తను. నాకు చాలామంది ఎన్నో కథలు చెప్తూ వుంటారు. అన్నీ రెగ్యులర్ ఫార్మేట్‌లో ఉంటాయి. మోహమాటానికి ఎవరూ డిజపాయింట్ కాకూడదని బాగుంది ఇంకా బెటర్మెంట్ చేయండి అని పంపిస్తూ ఉంటాను. అలాంటి టైంలో అప్సర్ చెప్పిన కథ విని స్పెల్ బౌండ్ అయ్యాను. ఇమీడియట్‌గా ఒకే చాలా బాగుంది అన్నాను. 
 
ఈ మధ్యకాలంలో ఇలాంటి కొత్త కథ వినలేదు. షుర్ షాట్ హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్‌తో నేను ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ కావడం జరిగింది. రెండు నెలలు కథపై డిస్కషన్ చేసి స్క్రీన్ ప్లే రాయడం జరిగింది. ఈ కథకి సందీప్ అయితే యాప్ట్‌గా ఉంటుందని సెలెక్ట్ చేశాం. జార్జిరెడ్డి తర్వాత తనకి ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. కానీ సెలెక్టీవ్‌గా కథలు చూజ్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. సాయికుమార్, సురేష్, బాబుమోహన్, గాయత్రి సురేష్ అందరూ కథ, క్యారెక్టర్స్ నచ్చి ఈ సినిమా చేస్తున్నారు. జవహర్ రెడ్డి కెమెరా, రాప్ రాక్ షకీల్ మ్యూజిక్ సినిమాకి వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ కానుంది. ఈ సినిమా తర్వాత ఫ్యూచర్‌లో శాండీ నుండి మరిన్ని మెమరబుల్ మూవీస్ వస్తాయి. ఆర్టిస్ట్ కమ్ ప్రొడ్యూసర్ మధుతో కలిసి ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది అన్నారు. 
 
నిర్మాత యం.యన్. మధు మాట్లాడుతూ.. మా బ్యానర్లో ఇది సెకండ్ ఫిల్మ్. అప్సర్ గంధర్వ స్టోరీ చెప్పగానే ఇన్‌స్టెంట్‌గా నచ్చింది. ఈ కథకి పర్ఫెక్ట్ యాప్ట్ హీరో శాండీ. ఇందులో ఒక ముఖ్య పాత్రలో యాక్ట్ చేస్తున్నాను. 28 నుండి కంటిన్యూస్‌గా రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం. మేలో గంధర్వ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు. 
 
హీరో సందీప్ మాధవ్ (శాండీ) మాట్లాడుతూ.. జార్జిరెడ్డి తర్వాత చాలా కథలు విన్నాను. అన్నీ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్‌లో ఉన్నాయి. కొత్తగా ఎదైనా చెయ్యాలని వైయిట్ చేస్తున్న నాకు అప్సర్ కథ చెప్పగానే ఈ మూవీలో నేనుకూడా ఉంటే బాగుండు అనిపించి వెంటనే ఒకే చెప్పా. తెలుగు సినిమా ఫార్మేట్లో ఓ కొత్త యాంగిల్‌ని పరిచయం చేస్తున్నారు. సాయికుమార్, సురేష్, బాబుమోహన్ లాంటి సీనియర్ యాక్టర్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. వీరశంకర్, మధుతో ట్రావెల్ చేయడం బాగుంది. ఎంతో సపోర్ట్ చేసి కాంప్రమైజ్ కాకుండా బిగ్ స్కేల్‌లో ఈ గంధర్వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంటర్టైన్‌మెంట్, ఎమోషన్, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సబ్జెక్ట్ ఇది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కొత్త సినిమా చూసిన ఫీలింగ్ ఆడియన్స్‌కి కలుగుతుంది.. అన్నారు. 
 
చిత్ర దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ.. ఏదైనా ఒక సినిమా చేయాలన్న కసితో వీరశంకర్‌కి చాలా కథలు చెప్పాను. ఆయన ఇంకా బెటర్మెంట్ చేయాలి.. కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ రావాలి నీకు అని చెప్పారు. 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన పెంచుకొని చాలా రోజులు వెయిట్ చేశాను. కొత్త కాన్సెప్ట్‌తో మంచి కథ రెడీ చేసి వీరశంకర్‌కి చెప్పాను. ఆయన వెంటనే ఫెంటాస్టిక్‌గా ఉంది అని ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు. 
 
బేసిగ్గా మిలటరీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చాను. అలాని ఇది అలాంటి సబ్జెక్ట్ కాదు. శాండీ మిలటరీ క్యారెక్టర్ అయినా ఫామిలీ సెంటిమెంట్, కామెడీ, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. గంధర్వ అంటే నిత్య యవ్వనంలా ఉండటం అని అర్థం. హిలేరియస్ ఇంటెన్సిటీ ఉంటుంది. సాయికుమార్, సురేష్, బాబుమోహన్, ఆదర్శ్ ఇంకా ఒక 30 మంది నటిస్తున్నారు. ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటుంది. మే 21న ఈ సినిమాని రిలీజ్ చేయాలని మా నిర్మాతలు ప్లాన్ చేశారు అన్నారు. 
 
ప్రముఖ హీరో సురేష్ మాట్లాడుతూ.. మంచి సినిమాలు, కొత్త కథలు చాలా రేర్‌గా వస్తాయి. క్యారెక్టర్స్‌కి ప్రాధాన్యత ఉన్న సినిమాలు చాలా అరుదు. ఇందులో ప్రతి పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటుంది. సాయికుమార్ కి ఆపోసిట్ గా నటిస్తున్నాను. పర్ఫెక్ట్ కాంబినేషన్లో చేయాలంటే మంచి మజా వస్తుంది. ఫస్ట్ సబ్జెక్ట్ వినగానే ఈ సినిమాలో నాకు పని ఉంది అనిపించి టెంప్ట్ అయి చేస్తున్నాను. కంప్లీట్ యూనిక్ ఫిల్మ్ ఇది. కథపై క్లారిటీ కాన్ఫిడెన్స్ ఉన్న డైరెక్టర్ అప్సర్. ఈ మధ్యకాలంలో అలాంటి డైరెక్టర్‌ని చూడలేదు. అతను సబ్జెక్ట్ నెరేట్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చుతుంది అన్నారు. 
 
బాబుమోహన్ మాట్లాడుతూ, గంధర్వ టైటిల్ చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. పోస్టర్స్  చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చేస్తున్నాను. ఈ చిత్రం పెద్ద హిట్ అయి అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అన్నారు. 
 
హీరోయిన్ అక్షత శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ మూవీలో సెకండ్ లీడ్ రోల్‌లో రాగిణీ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. డిగ్నిఫైడ్ క్వాలిఫైడ్ పిఏ‌గా పర్ఫెక్ట్ పాత్ర నాది. త్రూ అవుట్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన వీరశంకర్, మధు గారికి నా థాంక్స్.. అన్నారు. 
 
మ్యూజిక్ డైరెక్టర్ రాప్ రాక్ షకీల్ మాట్లాడుతూ, విభిన్నమైన కథతో తెరకెక్కుతున్న సినిమా గంధర్వ. కొత్తగా నన్ను నేను నిరూపించుకోవడాని సరైన అవకాశం గంధర్వ ద్వారా వచ్చింది. ఇలాంటి సినిమాకి క్రియేటివిటీతో డిఫరెంట్ మ్యూజిక్, రీ-రికార్డింగ్ చేసే స్కోప్ ఎక్కువ ఉంది అన్నారు. 
 
సందీప్ మాధవ్, గాయత్రి ఆర్.సురేష్, అక్షత శ్రీనివాస్, సాయికుమార్, సురేష్, పోసాని, బాబుమోహన్, సన, ఆదర్శ్ పసుపులేటి, తాగుబోతు రమేష్, మధు నారాయణ్, జయరాం, టి ఎన్ఆర్, సత్య శ్రీ, ఆటో రాంప్రసాద్, ఆర్జీవి రాము, పింగ్ పాంగ్ సూర్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డివోపి; జవహర్ రెడ్డి, మ్యూజిక్; రాప్ రాక్ షకీల్, ఎడిటర్; బస్వా పైడిరెడ్డి, ఆర్ట్; విజయ్ కృష్ణ, పిఆరోఓ; సాయి సతీష్, కో-డైరెక్టర్; ప్రకాష్ పచ్ఛల, ప్రొడక్షన్ కంట్రోలర్; జె.రామారావు, లైన్ ప్రొడ్యూసర్; పాతూరి శ్రీకాంత్ రెడ్డి, స్క్రీన్-ప్లే; వీరశంకర్, దర్శకత్వం; అప్సర్, నిర్మాత; యమ్ యన్. మధు.