Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నయనతారా తన్నేసింది.. ఇక సంగమిత్రకు అనుష్కనే బతిమలాడతారా?

హైదరాబాద్, బుధవారం, 12 జులై 2017 (08:34 IST)

Widgets Magazine

తెలుగు బాహుబలి సినిమాకు పోటీగా 450 కోట్ల ఖర్చుతో తీస్తున్నట్లు గొప్పలకు పోయిన తమిళ చారిత్రాత్మక చిత్రం సంగమిత్రకు సినిమా కష్టాలు తప్పటం లేదు. ఏ ముహూర్తంలో ఆ సినిమాను ప్రతిష్టాత్మకంగా ప్రకటించారో కానీ ఏ హీరోయినూ దానికి అచ్చిరావడం లేదు. ఆ సినిమాకు హీరోయిన్‌గా ముందు అనుకున్న శ్రుతిహసన్ నెలకుపైగా లండన్ వెళ్లి సొంత ఖర్చులపై యుద్ద విద్యలు నేర్చుకున్నప్పటికీ ఆమె కారణాలతో ఆమె తప్పుకున్నారు.
nayan-udayanidhi


ఆమె విషయంలో అత్యంత మొరటుగా వ్యవహరించిన నిర్మాణ సంస్థకు ఇప్పుడు ఏ హీరోయినూ అందుబాటులో లేకపోవడం మహా ఇబ్బందికరంగా తయారైంది. ఎలాగోలా ఒప్పించి రప్పించిన కూడా రెమ్యునరేషన్ విషయంలో కొండపైకి ఎక్కడంతో ఆమెనూ వదులుకున్నారు. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. రెమ్యునరేషన్ ఎంత తక్కువ ఇచ్చినా మారుబేరం పెట్టకుండా మంచి కథను వెంటనే ఒప్పేసుకునే సాఫ్ట్ అండ్ స్వీటీ అనుష్కనే మళ్లీ సంగమిత్రకు హీరోయిన్ అవుతుందా అని సినీజనం చెప్పుకుంటున్నారు.
 
తమిళసినిమా  తేనాండాల్‌ ఫిలిమ్స్‌ నిర్మాణంలో రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రం సంఘమిత్ర. ఇందులో జయంరవి–హీరోలుగా నటిస్తుండగా సంఘమిత్ర అనే టైటిల్‌ రోల్‌ను శృతిహాసన్‌ నటించాల్సి ఉంది. అందుకోసం అమ్మడుకి అలనాటి కత్తిసాము వంటి కళల్లో శిక్షణలు కూడా ఇప్పించారు. అయితే, చిత్ర షూటింగ్‌ ప్రారంభం కాబోతుందన్న పరిస్థితుల్లో ఆ చిత్రం నుంచి శృతి తప్పుకున్నట్టు వెల్లడించారు. దీంతో ఆ పాత్ర కోసం తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషా నటి కోసం గాలించాల్సిన పరిస్థితి సంఘమిత్ర బృందానికి ఏర్పడింది.
 
అప్పుడే దక్షిణాదిలో అగ్ర తారలుగా వెలుగుతున్న నయనతార, అనుష్కలతో రెండు సంవత్సరాలకు కాల్‌ షీట్లకు బేరసారాలు జరిపారు. అయితే, ఇద్దరూ ఇప్పటికే కొన్ని చిత్రాల్లో  కమిట్‌ అయ్యి నటిస్తుండడం వల్ల ఇప్పటికి సంఘమిత్రలో నటించడం కుదరదని తెలిపారట. అయినప్పటికీ నయనతార నటిస్తే బాగుంటుందని తలచిన చిత్ర బృందం ఆమెతో పలుమార్లు చర్చలు జరుపుతూ వచ్చారు. 
 
సంగమిత్రతో కమిట్‌ అయితే కనీసం ఒకటిన్నర సంవత్సరం కాలం వేరే చిత్రాల్లో నటించడానికి కుదరదు. దీంతో జాగ్రత్తగా ఆలోచించిన నయన్‌ తాను సంఘమిత్రలో నటించడానికి సిద్ధమేనని తెలిపిందట. అయితే అందుకు అమ్మడు కోరిన రెమ్యూనరేషన్‌ మొత్తం విని బెంబేలెత్తిన చిత్ర బృందం ఆ తర్వాత నుంచి ఆమెతో చర్చలు జరపడం నిలిపివేసినట్లు కోలీవుడ్‌ టాక్‌.
 
అయినా చారిత్రక పాత్రల్లో రాటుతేలిపోయన అనుష్కను పక్కన పెట్టుకుని ఎక్కడికెక్కడికి వెళతారేంట్రా బాబో ఈ తమిళ సినీ జనం అని నెటిజన్లు కామెంట్లమీద కామెంట్లు చేస్తున్నారు. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

చిరు 'నయనే'నట.. ఆగస్టు 15న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంచింగ్ డేట్..

చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీ లాంచింగ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ...

news

పవన్ నోటి మళ్లీ పాట.. ఈసారి ఏ నరసింహుడో మరి..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ పాటెత్తుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో వచ్చిన ...

news

మలయాళ స్టార్ దిలీప్ బహిష్కరణ.. భావనకు న్యాయం జరిగినట్లేనా?

దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగాయన్నది పాత సామెత. ఇప్పుడు ఈ లేటు స్పందనకు కాలం ...

news

తెరపైనే రెచ్చిపోతున్నాం.. నిజ జీవితంలో తుస్సే.. : దిశా పటానీ

బాలీవుడ్ హీరో టైగర్ ష్పాఫ్‌తో బాలీవుడ్ నటి దిశా పాటానీ ప్రేమాయణం కొనసాగిస్తున్నట్టు ...

Widgets Magazine