శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 3 జులై 2018 (12:47 IST)

పూరీ జగన్నాథ్ అలాంటోడా? అతని క్యారెక్టర్‌పై ఆరా తీసిన హీరోయిన్!

తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరు. ఆయన అనేక మంది హీరోలతో సినిమాలు చేసి.. సూపర్ డూపర్ హిట్స్ అందించారు. అలాంటి దర్శకుడి క్యారెక్టర్ గురించి ఓ కొత్త హీరోయిన్ ఆరా తీసిందట.

తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరు. ఆయన అనేక మంది హీరోలతో సినిమాలు చేసి.. సూపర్ డూపర్ హిట్స్ అందించారు. అలాంటి దర్శకుడి క్యారెక్టర్ గురించి ఓ కొత్త హీరోయిన్ ఆరా తీసిందట. ఆమె ఎవరో కాదు సంజనా గల్రానీ. తెలుగు తెరకి పరిచయమైన అందమైన మలయాళ కథానాయికలలో ఒకరు. మలయాళ సినిమాలతో పాటు కొన్ని తెలుగు సినిమాలలోనూ ఆమె నటించింది.
 
అయితే, ఈమెకు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'బుజ్జిగాడు' అనే చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో నటించే అవకాశం సంజనాకు వచ్చింది. దీంతో ఈ ఆఫర్‌ను అంగీకరించేముందు తొలుత సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ క్యారెక్టర్ గురించి ఆరా తీసి ఆ తర్వాత ఆ ప్రాజెక్టుకు ఓకే చెప్పిందట. 
 
నిజానికి పూరీ జగన్నాథ్ అప్పటికే ఓ స్టార్ డైరెక్టర్. కానీ ఈ విషయం ఆమెకు తెలియదు. అందువల్లే అలా చేసినట్టు సంజనా ఇపుడు వివరణ ఇస్తోంది. పైగా, అలాంటి స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ రావడమే అదృష్టం.. కళ్లు మూసుకుని చేసేయమని వర్ధమాన నటీనటులకు ఆమె విజ్ఞప్తి చేస్తోంది. 
 
కాగా, సంజనా తొలుత తెలుగులో నటించిన చిత్రం "సోగ్గాడు". ఇందులో తరుణ్ హీరో. ఈమెకు ఏదైనా సినీ అవకాశం వస్తే మాత్రం ఆ సినిమా చేయవచ్చా.. దర్శక నిర్మాతల నేపథ్యం ఎలాంటిది? అని పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే సినిమాకు ఓకే చెబుతుందట.