గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

"లవ్‌స్టోరీ" నుంచి సారంగ దరియా... డ్యాన్స‌తో మెస్మరైజ్ చేసిన సాయిపల్లవి...(Video)

దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న మరో చిత్రం లవ్‌స్టోరీ. అక్కినేని నాగ చైతన్య - సాయిపల్లవి జంటగా నటించగా, ఈ మూవీ ఏప్రిల్ 16వ తేదీన విడుదలకానుంది. 
 
ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, ఈ సినిమా నుంచి 'సారంగ దరియా' పాటను హీరోయిన్ స‌మంత త‌న ట్విట్టర్ ఖాతా ద్వారా విడుద‌ల చేసింది. సాయిపల్లవి డ్యాన్సుతో మెస్మరైజ్ చేసింద‌ని సమంత పేర్కొంది. ఈ సినిమాలో నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి హీరో, హీరోయిన్లుగా న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే.  
 
‘సారంగ దరియా’ పాట లిరిక్స్‌తో పాటు సాయిప‌ల్ల‌వి డ్యాన్స్ అల‌రిస్తోంది. ఇటీవ‌ల ఈ పాట‌కు సంబంధించిన ప్రోమోలు విడుద‌ల చేసి, దీనిపై ఆసక్తిని పెంచారు. తెలంగాణ  జానపద పాటగా సాగుతోన్న ఈ పాటను మంగ్లీ పాడింది. సుద్దాల అశోక్‌ తేజ లిరిక్స్‌ అందించారు. 
 
ఈ సినిమాకు పవన్‌ సీహెచ్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్‌ 16న ‘లవ్‌స్టోరి’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.