శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (16:00 IST)

నటుడు శరత్ బాబు ఆరోగ్యం అత్యంత విషమం

sarathbabu
నటుడు శరత్ బాబు ఆరోగ్యం అంత్యంత విషమంగా మారింది. ఆయన శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ వ్యాపించందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరబాదా గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో ఐసీయూ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై ఆదివారం సాయంత్రం వైద్యులు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. 
 
కాగా, కొన్నాళ్ల క్రితం అనారోగ్యానికి గురైన శరత్ బాబు.. బెంగుళూరులో చేరి చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత మరోమారు అస్వస్థతకు గురికావడంతో ఆయన ఈ నెల 20వ తేదీన బెంగుళూరు నుంచి హైదరాబాద్ నగరానికి తరలించారు. ప్రస్తుతం ఏఐజీలో చికిత్స పొందుతున్నారు. 
 
ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న శరత్ బాబు శరీరంలో ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు వంటి ప్రధాన అవయవాలు దెబ్బతిన్నట్టు సమాచారం. మరికొన్ని గంటలు గడిస్తే తప్ప ఆయన పరిస్థితి గురించి పూర్తిగా చెప్పలేమని వైద్యులు తెలిపారు.