సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2024 (17:37 IST)

సరిపోదా శనివారం బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ : నేచురల్ స్టార్ నాని

Nani, Dil Raju, DVV Danaiah, Priyanka Arul Mohan, Kalyan Dasari
Nani, Dil Raju, DVV Danaiah, Priyanka Arul Mohan, Kalyan Dasari
వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న  ఈ మూవీలో SJ సూర్య పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నారు.ఈ అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మూవీ యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
 
నాని మాట్లాడుతూ.. మన మధ్యలో ఒక ప్రామిస్, ఒక బాండ్ వుంది. ఈ బాండ్ ని ఇంకా ఇంకా బలపరిచే సినిమా 'సరిపోదా శనివారం' అవుతుంది. ఈసారి సినిమా హాళ్ళు కాన్సర్ట్ లా వుంటుంది. జేక్స్ బిజోయ్ చితకొట్టేస్తున్నాడు. ఎప్పుడెప్పుమీరు చూస్తారా అని ఎదురుచూస్తున్నాను. మీతో పాటు చూడటానికి ఎదురుచూస్తున్నాను. సుదర్శన్ 35 ఎంఎం కి మార్నింగ్ 11 షోకి వస్తున్నాను. కలసి సెలబ్రేట్ చేసుకుందాం. వివేక్ ఆ రోజే వస్తాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మునిగిపోయి వున్నాడు. దానయ్య గారు ఆర్ఆర్ఆర్ లాంటి సక్సెస్ చూసిన తర్వాత అంత తొందరగా ఏదీ ఆనదు. కానీ ఇది ఆనుతుందనే నమ్మకం వుంది. వివేక్ రెండు నెలలుగా నిద్రపోయింది లేదు. ఆ కష్టం తెరపై కనిపిస్తుంది. ఈసారి వాళ్ళందరి కోసం ఈసారి సినిమా వేరే లెవల్ కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రీరిలీజ్ ఈవెంట్ 24న జరగబోతోంది. టీం అందరితో కలసి ఆ రోజు సెలబ్రేట్ చేసుకుందాం. ఆగస్ట్ 29న థియేటర్స్ లో కలుద్దాం. నాకు కోపం వచ్చింది, నాకు కోపం వచ్చిందంటే బ్లాక్ బస్టర్ కన్ ఫర్మ్ అవ్వాల్సిందే  అంతో సరదాగా అన్నారు
 
ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ తర్వాత దానయ్య గారి బ్యానర్ నుంచి వస్తున్న ఈ సినిమా తెలుగు స్టేట్స్ డిస్ట్రిబ్యుషన్ రైట్స్ లో పార్ట్ చేసినందుకు థాంక్ యూ దానయ్య గారు. ఎస్జే సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాలి. గేమ్ ఛేంజర్ షూటింగ్ లో గ్యాప్ వచ్చినప్పుడల్లా ఎక్కువగా ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. ఇద్దరూ పోటాపోటీ గా నటించారు. ట్రైలర్ చూస్తూనే అర్ధమౌతోంది. ట్రైలర్ చూసి నాని, దానయ్య గారు, డైరెక్టర్ వివేక్ కి ఫోన్ చేశా. వివేక్ చాలా సర్ ప్రైజ్ చేశాడు. అంతకుముందు సినిమాలని సాఫ్ట్ గా తీశాడు. ఈ సినిమాని ఇరగదీశాడు. నాని గారితో మేము చేసిన ఎంసిఏ పెద్ద హిట్టు. దాన్ని దసరా బీట్ చేసింది. దసరాని సరిపోదా శనివారం బీట్ చేయబోతోందని ట్రైలర్ చూసి కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. ఆగస్ట్ 29న నాని గారికి దసరాని బ్రేక్ చేసే సినిమా రాబోతోంది. అందరికీ  ఆల్ ది బెస్ట్. ఈ సినిమా 29న బ్లాస్ట్ కాబోతోంది. ఈ సినిమా విజయం యూనిట్ కి ఎంత అవసరమో సినిమా ఇండస్ట్రీకి కూడా అంత అవసరం. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను' అన్నారు. 
 
హీరోయిన్ ప్రియాంక మోహన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. గ్యాంగ్ లీడర్ తర్వాత నానిగారికి జోడిగా ఈ సినిమాతో రావడం ఆనందంగా వుంది. డీవీవీ ప్రొడక్షన్ లో ఈ సినిమాతో పాటు ఓజీ తో మళ్ళీ వస్తున్నాను. ఈ సినిమాలో పార్ట్ కావడం చాలా అనందంగా వుంది. ఇందులో నా పాత్ర పేరు చారులత. చాలా బ్యూటీఫుల్ క్యారెక్టర్. తను చాలా సాఫ్ట్ కాప్. వివేక్ గారు చాలా బ్యూటీఫుల్ కథని రాశారు. సినిమాలో నైస్ లవ్ స్టొరీ కూడా వుంది. ఆగస్ట్ 29న తప్పకుండా సినిమా చూడండి' అన్నారు.
 
ప్రొడ్యూసర్ డివివి దానయ్య మాట్లాడుతూ... సరిపోదా శనివారం ఆగస్ట్ 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నాం. సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి నాని గారు. మొదటి నుంచి చివరి వరకూ చాలా బాగా చేశారు. డైరెక్టర్ గారు కూడా అద్భుతమైన కథ రాశారు, గొప్పగా తీశారు. సూర్య, ప్రియాంక మోహన్ ఇలా అందరూ చక్కగా నటించారు. జేక్స్ బిజోయ్ చాలా అద్భుతమైన మ్యూజిక్ చేశారు. డీవోపీ మురళి గా గొప్ప విజువల్స్ ఇచ్చారు. సినిమా పెద్ద హిట్ కాబోతోంది'అన్నారు.