గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 నవంబరు 2021 (19:20 IST)

వెనక్కి తగ్గిన సర్కారువారి పాట : విడుదల తేదీ మార్పు!

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌ హీరోయిన్‌. ఇప్పటివరకు సంక్రాంతి బరిలో ఉన్న ఈ చిత్రం తాజాగా.. వేసవి బరిలోకి వెళ్లింది. 
 
వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం వాయిదాపడింది. 2022 ఏప్రిల్‌ 1న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్‌ని విడుదల చేసింది. 
 
ఇదిలావుంటే, సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ నటించే 'భీమ్లా నాయక్', జనవరిలో 'ఆర్ఆర్ఆర్', ప్రభాస్ నటిస్తున్న 'రాధేశ్యామ్' వంటి భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. దీంతో సర్కారు వారి పాట రిలీజ్ డేట్‌ని మేకర్స్ మార్పు చేసినట్టు సమాచారం.