శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 28 ఆగస్టు 2019 (17:00 IST)

శ‌ర్వానంద్ కొత్త సినిమా స్టార్ట్ చేసేసాడు... ఇంత‌కీ కాన్సెప్ట్ ఏంటి..?

ప‌డిప‌డి లేచే మ‌న‌సు, ర‌ణ‌రంగం సినిమాల‌తో ఆక‌ట్టుకోలేక‌పోయిన యువ హీరో శ‌ర్వానంద్ కొత్త సినిమాని స్టార్ట్ చేసేసాడు. శ‌ర్వానంద్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.ఆర్‌.ప్ర‌కాశ్ బాబు, ఎస్‌.ఆర్‌.ప్ర‌భు నిర్మాత‌లుగా శ్రీకార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాని చేస్తున్నారు. ఈ చిత్రం చెన్నైలో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. షూటింగ్ కూడా ప్రారంభమ‌వుతుంది. 
 
ఈ చిత్రంలో `పెళ్ళిచూపులు` ఫేమ్ రీతూవ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తుంది. నాజ‌ర్‌, వెన్నెల‌ కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. విడ‌దీయ‌లేని స్నేహం, ప్రేమ అనే అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్క‌నుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ ఈ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నారు. 
 
జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ సారంత్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. వ‌చ్చే ఏడాది వేస‌విలో సినిమాను విడుద‌ల చేయడానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.