శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (09:15 IST)

అద్దె గర్భంతో కవల పిల్లలకు తల్లిగా మారిన రష్మీ

బాలీవుడ్ బుల్లితెర నిర్మాత రష్మీ శర్మ ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. సర్రోగసీ విధానంతో ఆమె ట్విన్ బేబీ బాయ్స్‌కు తల్లిగా మారింది. నిజానికి ఈ ఇద్దరు పిల్లలను గతవారమే రష్మీ దంపతులు తమ ఇంటికి తీసుకొచ్చారు

బాలీవుడ్ బుల్లితెర నిర్మాత రష్మీ శర్మ ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. సర్రోగసీ విధానంతో ఆమె ట్విన్ బేబీ బాయ్స్‌కు తల్లిగా మారింది. నిజానికి ఈ ఇద్దరు పిల్లలను గతవారమే రష్మీ దంపతులు తమ ఇంటికి తీసుకొచ్చారు. కానీ, సమాచారాన్ని మాత్రం అత్యంత రహస్యంగా ఉంచారు.
 
కాగా, తన ప్రియుడు పవన్ కుమార్‌ను రష్మీ గత 2012 జూన్ 28వ తేదీన పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. అయితే, వీరికి పిల్లలు కలగకపోవడంతో సర్రోగసీ విధానం ద్వారా పిల్లలు కావాలని వైద్యులను సంప్రదించారు. వైద్యుల సూచన మేరకు అద్దెగర్భంతో రష్మి ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. 
 
రష్మీ బాలీవుడ్ టీవీ సీరియల్స్‌ను నిర్మించారు. అలాగే, పలు షోలకు నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుండా, రష్మీ శర్మ టెలీఫిల్మ్స్ పతాకంపై పింక్ అనే చిత్రాన్ని కూడా నిర్మించారు.