గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 10 అక్టోబరు 2018 (12:20 IST)

స‌వ్య‌సాచి ఫ‌స్ట్ సాంగ్ అదిరిందిగా... సినిమా ఎలా వుంటుందో?

అక్కినేని నాగ చైత‌న్య - ప్రేమ‌మ్ ఫేమ్ చందు మొండేటి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ స‌వ్య‌సాచి. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. కొన్ని గ్రాఫిక్స్ వ‌ర్క్ కంప్లీట్ కాక‌పోవ‌డం వ‌ల‌న వాయిదా ప‌డింది.


ఇక న‌వంబ‌ర్ 2న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. చైత‌న్య స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. మాధ‌వ‌న్, భూమిక కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రానికి స్వ‌ర‌వాణి కీర‌వాణి సంగీతం అందిస్తుండ‌డం విశేషం. ఈ చిత్రంలోని వై నాట్ అనే సాంగ్‌ను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసారు.
 
మనకిక్కడ చేదైన తీపౌతుందోయ్… మన ఇద్దరి బాధైనా హాయ్ అవుతుందోయ్…. నిన్ను విడిచిన నిమిషం నుంచి నిన్ను మ‌ర‌చిన క్ష‌ణ‌మే లేదు.. అంటూ క్యాచీ ప‌దాల‌తో అనంత శ్రీరామ్ రాసిన ఈ పాట‌కు స్వ‌ర‌వాణి సంగీతం కీర‌వాణి సంగీతం అందించ‌డంతో ఈ పాట విన్న వెంట‌నే న‌చ్చేస్తుంది. వినే కొద్దీ మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపిస్తుంది.
 
ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. వైవిధ్య‌మైన క‌థాంశంతో ఈ సినిమా రూపొంద‌డం.. టీజ‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి.. ఈ సినిమా చైత‌న్య‌కి ఎలాంటి విజ‌యాన్ని అందిస్తుందో చూడాలి.