శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 జులై 2015 (13:32 IST)

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మహేష్ బాబు.. బ్రహ్మోత్సవం తర్వాత..?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హ్యాపీడేస్ ఫేమ్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించనున్నట్లు తెలిసింది. జూలైలో బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ బాబు కమిట్‌మెంట్స్ పూర్తయ్యాక శేఖర్ కమ్ములతో ఒక సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. 
 
హ్యాపీడేస్ రిలీజైనప్పటి నుంచి మహేష్ బాబు కమ్ములతో సినిమా చేయాలని ఆత్రుతతో ఉన్నారని.. బ్రహ్మోత్సవం సినిమా పూర్తయ్యాక ప్రిన్స్ ఆ కోరికను నెరవెర్చుకుంటాడని తెలుస్తోంది. ప్రస్తుతానికి స్క్రిప్ట్ వర్క్‌లో శేఖర్ కమ్ముల బిజీగా ఉన్నారని, వచ్చే ఏడాది శేఖర్ కమ్ముల- మహేష్ బాబు కాంబినేషన్‌లో సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.