శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (17:58 IST)

షారూఖ్ ఖాన్ ఆల్ టైమ్ టాప్ గ్రాసర్స్ సాధించిన హీరోగా రికార్డ్

jawan-pataan
jawan-pataan
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కానీ రికార్డును సుసాధ్యం చేసుకున్న ఏకైక హీరో కింగ్ ఖాన్ షారూఖ్. ఈ అరుదైన రికార్డును ఆయన ఒకే ఏడాదిలోనే సాధించటం విశేషం. ఈ విషయాన్ని చిత్ర టీం ఈరోజు ప్రకటించింది. 
 
‘జవాన్’ సినిమాతో వరుసగా రెండో సారి టాప్ గ్రాసర్ సాధించిన హీరోగా ఆయన నిలిచారు. అంతే కాకుండా రూ.600 కోట్ల కలెక్షన్స్ సాధించిన తొలి సినిమా ఇది ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ సూపర్బ్ కలెక్షన్స్‌ను సాధిస్తూ దూసుకెళ్తోంది. శుక్రవారం జవాన్ సినిమా హిందీ చలన చిత్ర చరిత్రలో టాప్ గ్రాసర్ మూవీగా హిస్టరీని క్రియేట్ చేసి ఓ బెంచ్ మార్క్‌ను సెట్ చేసింది.
 
రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రూపొందిన జవాన్ సినిమా విడుదలైన రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ వసూళ్లను సాధిస్తూ హిస్టరీ అనే పదానికి పర్యాయపదంగా నిలుస్తోంది. సరికొత్త రికార్డులను వసూళ్ల పరంగా ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
 
హిందీ సిినిమాల పరంగా రూ.525.50 కోట్లు, ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ.584.32 కోట్లను సాధించిన జవాన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1043.21 కోట్లకు వసూళ్లను రాబట్టి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఈ భారీ కలెక్షన్స్‌ను ఈ చిత్రం కేవలం 22 రోజుల్లోనే సాధించటం విశేషం.
 
ప్రతీ వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ వాటి ప్రభావం జవాన్ సినిమాపై పడలేదు. మూడు వారాలవుతున్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఆదరణతో పాటు ప్రశంసలను అందుకుంటోందీ చిత్రం.