బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్న 'పఠాన్' - రూ.1000 కోట్ల దిశగా...
బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన చిత్రం "పఠాన్". గత నెల 25వ తేదీన విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఇప్పటికే రూ.700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రూ.1000 కోట్ల దిశగా దూసుకెళుతోంది.
అయితే, భారత చిత్రాలపై పాకిస్థాన్‌లో నిషేధం ఉంది. దీంతో పఠాన్ చిత్రాన్ని పాకిస్థాన్‌లో అక్రమంగా ప్రదర్శిస్తున్నారు. అక్కడ కూడా ఈ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతుంది. ఒక్కో టిక్కెట్ ధర రూ.900 నుంచి రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. అయినప్పటికీ థియేటర్లకు ప్రేక్షకులు పోటెత్తుతున్నారు. పఠాన్ చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.