శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2022 (07:56 IST)

నా ఉద్దేశం.. సెక్స్ మోసాల గురించి తెలియజేయడమే... : ముకేశ్ ఖన్నా

Mukesh Khanna
శృంగారం కోరుకునే యువతులు వేశ్యలతో సమానమంటూ మహాభారత్ సీరియల్‌లో భీష్మ పాత్రధారిగా గుర్తింపు పొందిన ముఖేశ్ ఖన్నా చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. నాగరిక సమాజానికి చెందిన యువతులు సెక్స్‌ గురించి మాట్లాడేందుకు ఆసక్తి చూపించరు. ఒకవేళ యువకులతో అలా ఎవరైనా అమ్మాయిలు మాట్లాడారంటే.. వారు వేశ్యలే అంటూ వ్యాఖ్యానించారు. ఇవి పెద్ద దుమారాన్నే రేపాయి. 
 
వీటిపై ఆయన వివరణ ఇచ్చారు. 'నేను సాధారణ స్త్రీ, పురుష సంబంధాలను దృష్టిలో పెట్టుకొని అలా మాట్లాడలేదు. నా అసలు ఉద్దేశం సెక్స్‌ మోసాల గురించి యువతను చైతన్యపరచడమే' అంటూ వివరణ ఇచ్చారు. మహిళల గురించి అవమానకరంగా మాట్లాడిన ముకేశ్‌ఖన్నాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ మహిళా కమిషన్‌ సైబర్‌ సెల్‌ పోలీసులకు నోటీసు పంపింది.