నాకేం కాలేదు.. ఆరోగ్యంగానే ఉన్నా.. మహానటిలో నటిస్తున్నా: షాలినీ పాండే (వీడియో)

బుధవారం, 13 సెప్టెంబరు 2017 (16:45 IST)

‘అర్జున్‌రెడ్డి’ హీరోయిన్ షాలినీ పాండే నెల్లూరులో అస్వస్థత గురైయ్యారు. నెల్లూరులో ఓ సెల్‌పాయింట్‌ను ప్రారంభించడానికి వెళ్లిన షాలినీ.. అక్కడ  అస్వస్థతకు గురవడంతో నగరంలోని బొల్లినేని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. చికిత్స అనంతరం గంట తర్వాత ఆమెను డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం ఆమె బాగానే వున్నారని వార్తలొచ్చాయి. 
 
అయితే ఆసుపత్రి నుంచి ఆమెను డిశ్చార్జి చేసే సమయంలో స్ట్రైచర్‌పై తీసుకురావడం, ఆమె ముఖం కనిపించకుండా తెల్లటి వస్త్రంతో శరీరమంతా కప్పి ఉంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. దీంతో అర్జున్ రెడ్డి హీరోయిన్ ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చి తనకు ఏం కాలేదని, బాగానే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు.
 
ఈ రోజు ఉదయం జ్వరం, తలనొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లానని, చికిత్స అందుకున్నాక ఆరోగ్యం బాగుందని చెప్పారు. తనకు కొత్త అవకాశాలు వస్తున్నాయని, ప్రస్తుతం ‘మహానటి’లో నటిస్తున్నానని వెల్లడించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందొద్దని అభిమానులకు సూచించారు.
 దీనిపై మరింత చదవండి :  
Facebook Nellore Mahanati Shalini Pandey Health Condition Live Chat

Loading comments ...

తెలుగు సినిమా

news

శ్రీవల్లి కథ అలా పుట్టింది.. జక్కన్న మహాభారతం తీసే ఛాన్సుంది: విజయేంద్ర ప్రసాద్

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా వైపు ప్రపంచ సినీ ప్రేక్షకులను తిరిగి చూసేలా చేసిన రచయిత, ...

news

పవన్‌ సినిమా నైజాం రైట్స్‌ అదుర్స్: బాహుబలికి తర్వాత రూ.29కోట్లకు అజ్ఞాతవాసి?

పవన్ కల్యాణ్ .. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ మూవీని హారిక ...

news

హార్దిక్ పాండ్యా-పరిణీతి చోప్రాలపై వ్యంగ్య పోస్టులు.. చంకలో కోలానా, పాండ్యానా?

క్రికెటర్ హార్దిక్‌ పాండ్యా-పరిణీతి చోప్రా మధ్య లవ్‌ ఎఫైర్‌ నడుస్తోందంటూ గత కొంతకాలంగా ...

news

దెయ్యం సినిమా భారీ సక్సెస్: బాక్సాఫీసును షేక్ చేస్తున్న ''ఇట్'' (Trailer)

హాలీవుడ్ కొత్త థ్రిల్లర్ ''ఇట్'' ప్రస్తుతం బాక్సాఫీసును షేక్ చేస్తోంది. అమెరికాలో కూడా ఈ ...