Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

షాహిద్‌తో కాటేజీ షేర్ చేసుకోవాల్సిరావడం నాకో పీడకల: కంగనా రనౌత్

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (17:47 IST)

Widgets Magazine

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటుంది. తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌పై విరుచుకుపడింది. విశాల్ భరద్వాజ్ రూపొందిస్తున్న చిత్రం ‘రంగూన్’ షూటింగ్ సందర్భంగా షాహిద్ కపూర్‌తో కాటేజీని షేర్ చేసుకోవడంపై కంగనా రనౌత్ స్పందించింది. షాహిద్ కపూర్, కంగనా రనౌత్‌ల మధ్య రంగూన్ సినిమా షూటింగ్ సందర్భంగా కోల్డ్‌వార్ జరిగినట్టుగా బిటౌన్‌లో ప్రచారం జరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలో కంగనాతో గొడవల్లేవని షాహిద్ చెప్తుండగానే.. కంగనా మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ షెడ్యూల్ సందర్భంగా షాహిద్‌తో ఒకే కాటేజిలో కలిసుండడమే తనకు ఎదురైన అతిపెద్ద సమస్యగా భావిస్తున్నట్టు పేర్కొంది. కాటేజ్ సౌకర్యాలు కూడా సరిగాలేని ఓ మారుమూల ప్రాంతంలో షూటింగ్‌కి వెళ్లామని.. అక్కడ కాటేజీలు లేక.. షాహిద్‌తో తాను కాటేజీ షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కంగనా చెప్పింది. 
 
షాహిద్‌కు స్పీకర్స్ దద్దరిల్లిపోయేలా పెద్ద పెద్ద సౌండ్స్‌తో చిత్రమైన పాటలు వినడం అలవాటు. ప్రతిరోజు ఆ హిప్ హాప్ మ్యూజిక్‌కి అదిరిపడుతూ లేవాల్సివచ్చేది. లేచిన వెంటనే రెడీ ఏదోఒకటి తిని బయటపడేదాని అంటూ కంగనా చెప్పుకొచ్చింది. మొత్తానికి షాహిద్‌తో కాటేజి షేర్ చేసుకోవాల్సిరావడం నాకో పీడకల అంటూ కంగనా కామెంట్ ఇచ్చేసింది. మరి దీనిపై షాహిద్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఓం నమో వేంకటేశాయ.. ఆ విధంగా థ్రిల్ కల్గించాడు... రివ్యూ రిపోర్ట్

భక్తిప్రదానమైన చిత్రంలో నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌ ఎలా వుంది. ఎలా చేశారనేకంటే.. వారి ...

17న వస్తోన్న కామెడీ థ్రిల్లర్ ‘వజ్రాలు కావాలా నాయనా’!

శ్రీపాద ఎంటర్‌‌టైన్మెంట్‌ పతాకంపై కిషోర్‌ కుమార్‌ కోట నిర్మించిన చిత్రం ‘వజ్రాలు కావాలా ...

news

ఆ బార్‌లో బుద్ధుడి విగ్రహం ఉంది... గూగుల్‌కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి: అనసూయ స్ట్రాంగ్ రిప్లై

సాయిధరమ్ తేజ్ మూవీ విన్నర్‌లోని లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. తమన్ మ్యూజిక్‌కి మంచి ...

news

నాగార్జున కెరీర్‌లో 'ఓం న‌మో వేంక‌టేశాయ' క‌లికితురాయి : మెగాస్టార్ చిరంజీవి

అక్కినేని నాగార్జున - దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ...