గురువారం, 6 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : బుధవారం, 5 మార్చి 2025 (13:21 IST)

RC 16: హైదరాబాద్ షూట్ లో రామ్ చరణ్ RC 16 చిత్రంలో శివ రాజ్‌కుమార్ ఎంట్రీ

Shiva Rajkumar makup
Shiva Rajkumar makup
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చి బాబు కలిసి RC 16 (వర్కింగ్ టైటిల్)ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇక కరుణడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో నటించనున్నారు. ఇటీవలే చిత్రబృందం శివన్న లుక్‌ టెస్ట్‌ని పూర్తి చేసింది. నేడు శివ రాజ్‌కుమార్ ఎంట్రీ ఇచినట్లు తెలిసింది. మేకప్ రీల్ ను  చిత్ర యూనిట్ విడుదలచేసింది. 
 
Shiva Rajkumar, Buchi Babu
Shiva Rajkumar, Buchi Babu
RC 16 షూటంగ్ గత ఏడాది ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత నవంబర్‌లో మైసూర్‌లో ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఇక ఈ మధ్యే టీం హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్‌ను ఫినిష్ చేసింది. ఈ చిత్రంలో జగపతి బాబు, బాలీవుడ్ నటుడు మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
 
మ్యూజికల్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమా కోసం సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి.