అతీంద్రియ శక్తుల గల శంబాల లో బాలుగా శివకార్తీక్
హీరో ఆది సాయికుమార్ ప్రస్తుతం యుగంధర్ ముని దర్శకత్వంలో ఫాంటసీ థ్రిల్లర్ శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్ మూవీని చేస్తున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డిలు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించ్చాయి.
శంబాల ప్రపంచాన్ని చూపించేలా రీసెంట్‌గా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోతో సినిమా స్థాయి ఏంటన్నది అందరికీ అర్థమైంది. ఈ చిత్రంలో ఆదితో పాటు అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్ వంటి వారు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇక ఇప్పుడు శివకార్తీక్‌ని బాలుగా ప్రేక్షకులకు పరిచయం చేశారు. బాలు కారెక్టర్‌లో మిస్టరీ ఉంటుంది. అతని క్యారెక్టర్ పోస్టర్‌ను చూస్తేనే ఆ విషయం తెలుస్తోంది. అతని వింత చూపులు, చుట్టూ ఉన్న వాతావరణం, పోస్టర్‌లో ఉన్న ఆ దిష్టిబొమ్మ ఇలా అన్నీ గమనిస్తుంటే.. ఆ పాత్రలోనే ఓ మిస్టరీ ఉన్నట్టుగా అనిపిస్తుంది.
ఆది ఈ చిత్రంలో భౌగోళిక శాస్త్రవేత్తగా నటిస్తున్నారు. వేల ఏళ్ల వెనక్కి ఆడియెన్స్‌ను తీసుకెళ్లేలా ఈ శంబాల ఉంటుంది. పురాణాలు, పురాతన చరిత్ర, అతీంద్రియ అంశాలను ఇందులో చూపించబోతోన్నారు. అద్భుతమైన వీఎఫ్ఎక్స్‌తో అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా సినిమాను రూపొందిస్తున్నారు. త్వరలోనే మేకర్స్ విడుదల తేదీని ప్రకటించనున్నారు.