గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 22 జులై 2019 (15:46 IST)

కొబ్బరిమట్టతో శివరంజని పోటీ.. రష్మీకి కలెక్షన్లు వుంటాయా?

ఆగస్టు 2న గుణ 369, రాక్షసుడు, కొబ్బరిమట్ట సినిమాలు విడుదల కానున్నాయి. అదే రోజున రష్మీ, నందు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న శివరంజని కూడా విడుదలవుతోంది. దీంతో కొబ్బరిమట్టతో రష్మీ పోటీపడనుందా అని టాక్ వస్తోంది. శివరంజని సినిమాలో కమెడియన్ ధన్ రాజ్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. గతంలో రష్మీ నటించిన నెక్ట్స్ నువ్వే, అంతకుమించి హారర్ సినిమాలు మోస్తరు కలెక్షన్లు సాధించాయి. 
 
కానీ తాజాగా విడుదల కానున్న శివరంజనిపై రష్మీ ఆశలు పెట్టుకుంది. అయితే సంపూర్ణేష్ బాబు నటిస్తున్న కొబ్బరిమట్ట సినిమా చాలా గ్యాప్ తర్వాత విడుదల కానుండటంతో శివరంజనితో పోటీ వుంటుందని టాక్ వస్తోంది. ఇంకా గుణ 369 కూడా రష్మీ సినిమా కలెక్షన్లను తగ్గిస్తుందని తెలుస్తోంది. 
 
ఇకపోతే.. రష్మీ, నందు ప్రధాన పాత్రలలో యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఏ. పద్మనాభ రెడ్డి, అయ్యన్న నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం శివరంజని. డైరెక్టర్ నాగ ప్రభాకర్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని ఆగస్టు 2న విడుదల చేయనున్నట్లు ధ్రువీకరిస్తూ.. చిత్ర బృందం ఓ పోస్టర్‌ని విడుదల చేశారు.