శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (15:13 IST)

సన్నీలియోన్ చెంపదెబ్బ: ఎంత కమ్మగా ఉందిరోయబ్బా.. అన్న రజ్నీష్ దుగ్గల్!

పోర్న్ స్టార్, బాలీవుడ్ నటీమణి సన్నీ లియోన్.. ఓ బాలీవుడ్ నటుడి చెంపచెల్లుమనిపించింది. సన్నీ కొట్టిన దెబ్బతో ఆ నటుడికి గాయం ఏర్పడింది. ఈ వార్త బిటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది రియల్ కాదని రీల్ కోసమని తేలింది. సినిమా సీన్ ప్రకారం సన్నీ లియోన్ తన సహచర నటుడు రజ్నీష్ చెంప చెల్లుమనిపించాలి. సన్నీ కూడా రజ్నీష్‌ను చెంప దెబ్బ కొట్టింది. అయితే ఈ సీన్ పండకపోవడంతో వన్ మోర్ టైమ్ అంటూ ఐదుసార్లు రజ్నీష్‌ సన్నీ చేతిలో చెంపదెబ్బలు తినాల్సి వచ్చింది. 
 
అయితే ఆరోసారి సన్నీ దెబ్బకు ఆ సినిమా దర్శకుడు ఫిదా అయిపోయాడు. ఇక సీన్ కూడా ఓకే అయింది. కానీ సన్నీ చేతిదెబ్బకు ఆ బాలీవుడ్ నటుడి చెంప వాసిపోయింది. దీన్ని చూసి సన్నీ కంటతడి పెట్టుకుంది. అంతటితో ఆగలేదు. క్షమాపణ కూడా అడిగేసింది. అయితే ఆ నటుడు మాత్రం పర్లేదని లైట్‌గా తీసుకున్నాడట. దీంతో సన్నీ చేతిలో దెబ్బలు తీసుకునేందుకు బాలీవుడ్ హీరోలు కూడా రెడీగా ఉన్నారని సినీ పండితులు అంటున్నారు. కాగా రాజీవ్ చౌదరి నిర్మాణ దర్శకత్వ పగ్గాలు చేపట్టిన ఈ సినిమా సమ్మర్ 2016లో విడుదల కానుంది.