బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 9 నవంబరు 2024 (15:59 IST)

సూర్య ‘కంగువా’ చిత్రంలో పాట పాడిన హీరోయిన్ శ్రద్దా దాస్

Shraddha Das
Shraddha Das
నటిగా శ్రద్దా దాస్‌కి మంచి పేరు ఉంది. ఇక ఇప్పుడు ఆమె ప్రొఫెషనల్ ప్లేబ్యాక్ సింగర్‌గా మారిపోయారు. ఇప్పుడు ఆమెను గాయనిగా ప్రేక్షకులకు దేవీ శ్రీ ప్రసాద్ పరిచయం చేస్తున్నారు. సూర్య నటించిన పాన్ ఇండియా చిత్రం కంగువాలో శ్రద్దా దాస్ ఓ పెప్పీ సాంగ్‌ను ఆలపించారు. సూర్య, దిశా పటాని, బాబీ డియోల్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 14న రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే.
 
ఇప్పటికే కంగువా చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. కంగువా నుంచి వచ్చిన యోలో పాట అందరినీ అలరించింది. యూట్యూబ్‌లో ఇప్పటికే మిలియన్ల వ్యూస్ సాధించింది.  దేవి శ్రీ ప్రసాద్, శ్రద్ధా దాస్, సాగర్ గాత్రం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాకేందు మౌళి సాహిత్యం అందరినీ ఆకట్టుకుంది.
 
యోలో పాటలోని శ్రద్ధా దాస్ గాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే, ఇటీవల హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగిన మ్యూజికల్ ఈవెంట్‌లో రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి శ్రద్ధాదాస్ పాటలను పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.