తల్లి కాబోతున్న సింగర్ శ్రేయా ఘోషల్.. ఫోటో వైరల్
ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. తాను తల్లి కాబోతున్నట్లు ఆమె ప్రకటించారు. బేబి శ్రేయాదిత్య త్వరలోనే వస్తున్నారంటూ కామెంట్ పెట్టారు. తమ జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలు కాబోతుందంటూ పేర్కొన్నారు.
ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు శ్రేయా. బేబి శ్రేయాదిత్య త్వరలోనే రానున్నారు. శైల్ ఆదిత్య, నేను ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకునేందుకు చాలా థ్రిల్‌గా ఫీల్ అవుతున్నాము. మా జీవితంలో ఈ కొత్త అధ్యాయానికి మీ అందరి ప్రేమ, అశీస్సులు కావాలంటూ ఆమె ట్వీట్ పెట్టారు.
ఈ సందర్భంగా తన రీసెంట్ ఫొటోను కూడా ఒకటి షేర్ చేసుకున్నారు. అందులో శ్రేయా గర్భవతిగా ఉంది. మరోవైపు ఈ విషయం తెలిసిన అభిమానులు ఆమెకు అభినందనలు చెబుతున్నారు.
అయితే భారతదేశంలోని పలు భాషల్లో పాటలు పాడి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు శ్రేయా. ఈ క్రమంలో ఆమెకు ఎన్నో పురస్కారాలు కూడా లభించాయి. ఇక 2015లో తన స్నేహితుడు శైలాదిత్యను ఆమె వివాహం చేసుకున్నారు.