గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 2 మార్చి 2022 (17:08 IST)

ఉపాసనకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన శ్రీయా సరన్

Shriya Saran, Andrew Kochchiv
న‌టి  శ్రీయా సరన్ అపోలో కు వ‌చ్చింది. అక్క‌డ త‌న భ‌ర్త ఆండ్య్రూ కొశ్చివ్ కు ఆప‌రేష‌న్ జ‌రుగుతుంది. అక్క‌డ స‌రైన ట్రీట్‌మెంట్ ఇచ్చినందుకు ఉపాసనకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది శ్రీయా సరన్. రష్యన్ టెన్నిస్ ప్లేయర్ ఆండ్య్రూ కొశ్చివ్ ను ప్రేమ వివాహం చేసుకుంది.
 
ఇర‌వై ఏళ్ళుగా న‌టిగా వుంటున్నా త‌న శ‌రీర దారుడ్యాన్ని పెంచుకుంటుంది. ఇటీవల వ్య‌క్తి గ‌త విష‌యాల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకుంటోంది. అందులో భాగంగా  కొంత కాలంగా తన భర్త ఆండ్య్రూ హెర్నియా అనే వ్యాధితో బాధ పడుతున్నాడని తెలిపింది. అది తీవ్రం కావ‌డంతో ఇటీవ‌లే ఆప‌రేష‌న్ జ‌రిగింది. ఈ విష‌యం తెలిసిన శ్రియా స్నేహితులు ఆరోగ్యంగా వున్న ఆమె భ‌ర్త‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇలాంటి టైంలో మ‌రింత ధైర్యంగా వుండాల‌ని సూచించారు. 
 
తాజాగా  రాజమౌళి `ఆర్‌.ఆర్‌.ఆర్‌.` సినిమాలో రామ్ చరణ్ తల్లిగా నటించింది శ్రీయా. దాంతో పాటు మరో రెండు మూడు హిందీ సినిమాలను కూడా చేస్తోంది.