శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 8 అక్టోబరు 2015 (13:54 IST)

పాండాల్లా నిద్రపోతా.. నేనూ అంతే..!: శ్రుతిహాసన్, తమన్నాల నిద్ర కథ!

ట్విట్టర్ వేదికగా శ్రుతిహాసన్, తమన్నాల నిద్ర పురాణాలు బయటికొచ్చాయి. సాధారణంగా హీరోయిన్లు ఏసీ రూముల్లో పక్కా గదుల్లోనే హాయిగా నిద్రపోతారని అందరూ అనుకుంటారు. అసలు హీరోయిన్లకు నిద్రపోవడానికైనా టైముంటుందా అని మరికొందరు అనుకుంటారు. అయితే  తాము పాండాల లాంటోళ్లమని టాలీవుడ్ టాప్ హీరోయిన్లు శ్రుతిహాసన్, తమన్నాలు చెప్తున్నారు. 
 
ట్విట్టర్ వేదికగా శ్రుతి, తమన్నా నిద్ర సంగతిని చెప్పుకొచ్చారు. పాండాలు ఎక్కడపడితే అక్కడ, ఆఖరుకు చెట్టుపై కూడా నిద్రపోగలవని తెలుసుకున్న తమన్నా, 'తాను కూడా పాండా లాంటిదాన్నని, ఎక్కడైనా నిద్రపోతాన'ని ట్వీట్ చేసింది. దీనిని చూసిన శ్రుతిహాసన్ 'సేమ్ పించ్' అని రీట్వీట్ చేసింది.
 
'షూటింగ్‌లో ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్నా నిద్ర ముంచుకొస్తుందని తమన్నా వెల్లడించగా, ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతాన'ని శ్రుతి ట్విట్టర్లో తెలిపింది. దీనికి తమన్నా 'మీ టూ' అంటూ మళ్లీ సమాధానమిచ్చింది. అదన్నమాట.. శ్రుతిహాసన్, తమన్నాల నిద్ర కథ. ఈ కథ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోందట.