సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 నవంబరు 2020 (19:45 IST)

నేను మహా ముదురు అంటున్న విశ్వనటుడి ముద్దుల కుమార్తె!!! (video)

విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దుల కుమార్తెల్లో ఒకరు శృతిహాసన్. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే, గత రెండేళ్లుగా ఈ అమ్మడు సౌత్ ఇండస్ట్రీకి చెందిన మూవీల్లో కనిపించడం లేదు. దీంతో ఆమె సినీ కెరీర్‌ ముగిసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. 
 
వీటిపై శృతిహాసన్ స్పందించారు. తనకు సినిమా అవకాశాలు లేనంతమాత్రాన కెరీర్ ముగిసినట్టు కాదన్నారు. అస్సలు తన కెరీర్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ బ్రేక్ పడదని చెప్పుకొచ్చారు. తనకు కేవలం నటన మాత్రమే కాదనీ, మోడలింగ్, రచన, సంగీతం, పెయింటింగ్ రంగాల్లో ప్రావీణ్యం ఉందని చెప్పుకొచ్చింది. 
 
ఇలా మల్టీ టాలెంటెడ్ ఉన్న నటీనటుల కెరీర్ ఎలా ముగుస్తుందని ఆమె ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా, ప్రస్తుతం తాను పలు చిత్రాల్లో నటించేందుకు సమ్మతించినట్టు చెప్పుకొచ్చింది. 
 
తాను వరుసగా నాలుగు సినిమాలు చేసిన అనంతరం మ్యూజిక్ ప్రాజెక్టులు, ఇతర విషయాల కోసం సమయాన్ని ఇస్తానని తెలిపింది. కరోనా విజృంభణ సమయంలోనూ తాను పనిచేస్తూనే ఉన్నానని చెప్పింది.