గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 జులై 2024 (15:28 IST)

మహిళా జర్నలిస్టును వేధించిన జాన్ విజయ్‌ - చిన్మయి సంచలన ఆరోపణలు

"సలార్" నటుడు జాన్ విజయ్‌పై గాయని, చిన్మయి శ్రీపాద సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల ఓ మహిళా జర్నలిస్టును జాన్ విజయ్ వేధించాడంటూ ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడని సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. పబ్‌లు, రెస్టారెంట్లు, ఇతర ప్రదేశాల్లో ఆడవాళ్లతో జాన్ విజయ్ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించారు. 
 
అధికార డీఎంకేకు చెందిన జాన్ విజయ్ అని, సినీ గేయ రచయిత వైరముత్తు, విజయ్ ఒకే జాతికి చెందిన వారిని చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి కంటికి మహిళలు కనిపిస్తే చాలు రెచ్చిపోతారంటూ మండిపడ్డారు. ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. 
 
కాగా, సలార్ మూవీలో జాన్ విజయ్ రంగ పాత్రలో నటించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన "వాల్తేరు వీరయ్య" మూవీలో విలన్‌గా నటించి మెప్పించారు. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషలకు చెందిన పలు భాషల్లో విలన్‌గా నటిస్తున్నారు.