సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 మే 2021 (11:00 IST)

పోలీసులను ఆశ్రయించిన సింగర్ మధుప్రియ.. ఎందుకంటే?

సింగర్ మధుప్రియ పోలీసులను ఆశ్రయించింది. "ఆడపిల్లనమ్మా" అనే సాంగ్ తో చిన్న వయసులోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది సింగర్ మధుప్రియ. ఆ తరువాత తెలుగువారందరికీ సుపరిచితమైన మధు బిగ్ బాస్ సీజన్ వన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. 
 
మధుప్రియ తాజాగా పోలీసులను ఆశ్రయించారు. తనకు బ్లాంక్ కాల్స్ వస్తున్నాయంటూ పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. లాక్ డౌన్ కారణంగా మధుప్రియ హైదరాబాద్ షీ టీమ్స్ కు మెయిల్ లో ఈ ఫిర్యాదు చేశారు. అయితే షీ టీమ్స్ మెయిల్ ను సైబర్ కు బదిలీ చేశారు. 
 
గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బ్లాంక్ కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదులో మధు ప్రియ పేర్కొన్నారు. తనకు వచ్చిన బ్లాంక్ ఫోన్ కాల్స్ వివరాలను సైబర్ క్రైమ్ కు అందజేసింది. మధు ప్రియ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీసీ 509, 354b సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారని సమాచారం.