బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 29 నవంబరు 2021 (22:23 IST)

ఐసియులో సిరివెన్నెల: ఎప్పటికప్పుడు ఆరోగ్య స్థితి చెప్తామన్న వైద్యులు

టాలీవుడ్ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యూమోనియా కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసారు.

 
సీతారామశాస్త్రి న్యూమోనియాతో ఈ నెల 24న ఆస్పత్రిలో చేరారనీ, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన త్వరగా కోలుకునేందుకు అవసరమైన చికిత్సను వైద్యులు అందిస్తున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు బులిటెన్ ద్వారా తెలియజేస్తామన్నారు.