శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 6 జనవరి 2024 (11:46 IST)

టైటిల్ సాంగ్ లోనూ క్యురియాసిటీ పెంచిన శివ కందుకూరి.. భూతద్ధం భాస్కర్ నారాయణ

Bhaskar Narayana look
Bhaskar Narayana look
శివ కందుకూరి హీరోగా 'భూతద్ధం భాస్కర్ నారాయణ' సినిమా రూపొందింది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి, పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు  చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో టీజర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. 
 
న్యూ ఏజ్ స్టార్ కంపోజర్ శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్. శ్రీచరణ్ పాకాల స్వరపరిచి స్వయంగా పాడిన ఈ పాట చాలా క్యాచిగా వుంది. పురుషోత్తం రాజ్, సురేష్ బనిశెట్టి రాసిన లిరిక్స్ హీరో క్యారెక్టరైజేషన్ ని ఆకట్టుకునేలా ప్రజెంట్ చేశాయి. పాటలో విజువల్స్ చాలా ఎట్రాక్టివ్ గా వున్నాయి.
 
రాశి సింగ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అరుణ్ కుమార్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, శివన్నారాయణ, కల్పలత ఇతర కీలక పాత్రలు పోషించారు. 
 
ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు