ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (18:00 IST)

బిగ్ బాస్-3.. రమ్యకృష్ణ అదుర్స్... రెచ్చిపోయిన హౌస్ మేట్స్.. మస్తు మజా..!!

బిగ్ బాస్ మూడో సీజన్ ఆదివారం ఎపిసోడ్ రంజుగా వుండనుంది. పూర్తి ఎంటర్‌టైన్‌గా సాగనుంది. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింటిని షేక్ చేస్తోంది. అక్కినేని నాగార్జున తన ఫ్యామిలీతో యూరఫ్ పర్యటనలో ఉండటంతో ఈ వారాంతం ఆయన షోను హోస్ట్ చేయలేకపోయారు. దీంతో బిగ్ బాస్ నిర్వాహకలు ప్రత్యామ్నాయంగా ప్రముఖ నటి రమ్యకృష్ణను రంగంలోకి దింపారు. శనివారం జరిగిన షోలోకి ఎంటరైన ఆమె తనదైన శైలిలో ప్రోగ్రాంను రక్తికట్టించారు. 
 
ఆదివారం రాత్రి ప్రసారం అయ్యే వీకెండ్ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ఒకటి స్టార్ మా వారు విడుదల చేశారు. రమ్యకృష్ణ ఇంటి సభ్యులతో సీన్ చేయించారు. ఇందులో భాగంగా చంద్రముఖి సీన్‌ను శ్రీముఖి చేసింది. బాబా భాస్కర్, శ్రీముఖి మధ్య జరిగే ఈ సీన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయం. పునర్నవి, రాహుల్ కలిసి లవర్స్ మాదిరిగా నటించారు.
 
వరుణ్ సందేశ్, వితికి మధ్య జరిగిన మరో సీన్ ఆసక్తికరంగా ఉంది. బిగ్ బాస్‌కు వచ్చిన తర్వాత నీ ప్రేమ, ముద్దులు, ముచ్చట్లు ఏమీ లేవు అంటూ వితిక ఏడ్చేయడం ఇక్కడ ముద్దు, ముచ్చట్లు చేస్తే బావుండదు కదా అంటూ వరుణ్ సందేశ్ ఆమె కోరికను తిరస్కరించడం ఫన్ క్రియేట్ చేసింది. 
 
ఇప్పటికే ఆదివారం షో షూటింగ్ పూర్తి కావడంతో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ వారం ఎవరిని ఎలిమినేట్ చేయకుండా అందరిని సేఫ్ జోన్‌లో ఉంచారని తెలుస్తోంది. కానీ ఎలిమినేషన్‌ లేకపోవడంపై బిగ్ బాస్ త్రీ ప్రేక్షకులు మండిపడుతున్నారు. 
 
ఎలిమినేషన్ కోసం ఓట్లు వేసిన వారు పిచ్చోళ్లు కాదు కదా అంటూ బిగ్ బాస్‌పై మండిపడుతున్నారు. ఎలిమినేషన్ వుంటే ముందే చెప్పాలిగా అంటూ వారు ఫైర్ అవుతున్నారు. అయితే ప్రోమోను చూస్తే ఎలిమినేషన్ వుంటుందనే తెలుస్తోంది. ఏముంది.. మీరూ ప్రోమోను ఓ లుక్కేయండి.