అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారు : స్మృతి ఇరానీ
తాను టీవీ సీరియల్స్‌లో నటించే సమయంలో అందరికంటే తనకే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చేవారని కేంద్ర మంత్రి, బుల్లితెర నటి స్మృతి ఇరానీ అంటున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బుల్లితెరలో అత్యధిక పారితోషికం పొందుతున్న నటి తానే అని చెప్పారు. టీవీ సీరియల్స్ ప్రేక్షకాదారణ, రేటింగ్స్ ఆధారంగా రెమ్యునరేషన్ ఇచ్చేవారు. కాంట్రాక్టర్లతో మేము కుదుర్చుకున్న ఒప్పందాలను బహిర్గతం చేయలేం. అలాంటి పరిస్థితుల్లో కోరినంత రెమ్యునరేషన్ ఇస్తారని వెల్లడించారు.
తాను కూడా ఈ ఇండస్ట్రీలో భాగమైనందుకు నాకూ ఓ నంబర్ ఉందన్నారు. ఆ ఆధారంగానే పారితోషికం తీసుకుంటానని చెప్పారు. అయితే, పారితోషికం విషయంలో ఇతర నటీనటులను అధికమించినట్టు చెప్పారు. తనను చూసి ఎంతో మంది స్ఫూర్తి పొందుతున్నారని ఇది కేవలం నటన మాత్రమే కాదు.. ఓ బాధ్యత అని స్మృతి ఇరానీ అన్నారు. ఈ సీరియల్‌లో ఇతర నటీమణులైన రూపాలీ గంగూలీ ఒక్కో ఎపిసోడ్‌కు రూ.3 లక్షలు, హీనా ఖాన్ రూ.2 లక్షలు తీసుకుంటున్నట్టు సమాచారం. కాగా, స్మృతి ఇరానీకి మాత్రం రూ.14 లక్షలు చొప్పున ఒక్కో ఎపిసోడ్‌కు తీసుకున్నట్టు సమాచారం.