శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 8 అక్టోబరు 2015 (12:17 IST)

సోగ్గాడే చిన్ని నాయనకు సోపేసిన అనసూయ.. ఎక్కడా చూసినా..?

''సోగ్గాడే చిన్ని నాయన'' సినిమాలో అనసూయకే నాగ్ ప్రాధాన్యతనిస్తున్నాడట. లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ, హంసానందిని లాంటి హీరోయిన్లున్నప్పటికీ.. అనసూయతో కలిసిన స్టిల్స్‌నే నాగ్ విడుదల చేస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేస్తే తప్పకుండా అనసూయ ఫోటో ఉండాల్సిందేనని నాగ్ పట్టుబడుతున్నారట. 
 
నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ముగ్గురు భామలతో నాగార్జున రొమాన్స్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే పూర్తయ్యింది. తనకు సెంటిమెంట్ రీత్యా బాగా కలిసి వచ్చే డిసెంబర్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు నాగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది. మరదలిగా నాగ్ సరసన అదరగొట్టేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్‌కు సంబంధించి విడుదల చేసిన ఫోటోల్లో ఎక్కువ నాగ్, అనసూయ ఫోటోలుండటం అందరినీ ఆశ్చర్యపరిచింది.
 
సాధారణంగా టాప్ హీరోల సినిమాలలో హీరోయిన్‌లకే హీరోలు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంటారు. కానీ నాగార్జున మాత్రం ఇందులోని నలుగురు అమ్మాయిలకీ ప్రాధాన్యమిస్తున్నాడు. ఇంకా కీలకపాత్రలో కనిపిస్తున్న అనసూయకి అందరికంటే కాస్త ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడని సినీ జనం అనుకుంటున్నారు. అలాగే చిన్న స్టార్స్ ఫోటోలు సినిమా ప్రమోషన్లో బయటికి కనిపించవు. అయితే అనసూయ క్రేజ్ రీత్యా సోగ్గాడే చిన్ని నాయన సినిమా స్టిల్స్‌లో ఆమె కచ్చితంగా ఉండి తీరాల్సిందేనని నాగ్ అంటున్నాడు.