బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 28 అక్టోబరు 2024 (19:23 IST)

నేను నాలుగో పెళ్లి చేసుకున్నానని ఓర్వలేకపోతున్నారు: నటుడి వ్యాఖ్యలు

Actor Bala 4th Marriage
ఫోటో కర్టెసి- సోషల్ మీడియా
తను నాలుగో పెళ్లి చేసుకున్నానని చూసి చాలామంది ఓర్వలేక అసూయపడుతున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నాడు మలయాళ నటుడు బాలా. మొదటి ఇద్దరికి వేర్వేరు కారణాల వల్ల విడాకులు ఇచ్చాడు. మూడోభార్య గాయని అమృతా సురేశ్‌ ఇతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త బాలా తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది. దీనితో అతడిని పోలీసులు అరెస్టు చేసారు.
 
ఇటీవలే బెయిల్ పైన విడుదలైన బాలా... తనకంటే వయసులో 18 ఏళ్లు చిన్నదైన యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... తను నాలగవ పెళ్లి చేసుకున్నానని చూసి చాలామంది అసూయ చెందుతున్నారని అన్నాడు. ఐతే కేరళలో చాలామంది అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడంలేదనీ, తనకు డబ్బు వుంది కనుక పెళ్లాడేందుకు అమ్మాయిలు దొరుకుతున్నారంటూ వ్యాఖ్యానించాడు.