గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 మే 2022 (10:05 IST)

బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాకు ఎంగేజ్‌మెంట్

sonakshi sinha
బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్నసిన్హా కుమార్తె సోనాక్షి సిన్హాకు రహస్యంగా నిశ్చితార్థం జరిగినట్టు ఆమె షేర్ చేసిన ఫోటోలు వెల్లడిస్తున్నాయి. అయితే, తనకు కాబోయే భర్తను ఫోటోలను మాత్రం ఆమె స్పష్టంగా బహిర్గతం చేయలేదు. కానీ, తనకు కాబోయే భర్త చేతిని పట్టుకుని మాత్రమే కనిపించింది. అయితే, తన ప్రియుడి ముఖాన్ని మాత్రం చూపించకుండా సీక్రెట్ మెయింటెయిన్ చేసింది. 
 
మరోవైపు, తమ అభిమాన హీరోయిన్ ఓ ఇంటికి కోడలు కాబోతుందన్న వార్త తెలుసుకున్న సోనిక్షి అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే, ఇంత సీక్రెట్‌గా, అర్జంటుగా ఎంగేజ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. 
 
ఇదిలావుంటే, సోనాక్షి సిన్హా తన ఎంగేజ్‌మెంట్‌పై స్పందించారు. "ఈ రోజు నాకు ఒక గొప్ప రోజు. ఎప్పటి నుంచో నాకున్న ఒక పెద్ద కల నెరవేరబోతుంది. ఇది జరిగిందంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు ఈ విషయాన్ని అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది" అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.