గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 నవంబరు 2021 (13:52 IST)

శివశంకర్‌కు సోనూసూద్ అండ.. ఫ్యామిలీతో టచ్‌లో ఉన్నానని ట్వీట్

Sonusood
ప్రముఖ కొరియోగ్రఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా బారినపడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గత నాలుగు రోజుల పాటు ఆయన హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రి చికిత్స పొందుతున్నారు. 75 శాతం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు గురైనట్లు వైద్యులు చెప్తున్నారు. 
 
శివ శంకర్ మాస్టర్ పెద్దకొడుకు కూడా కరోనా బారినపడి సౌదీ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. అటు శివ శంకర్ మాస్టర్ భార్య కూడా కరోనా కారణం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో శివశంకర్ మాస్టర్‌కు బాలీవుడ్ హీరో సోనూసూద్ ఆర్థిక సాయం అందించారు. 
 
శివ శంకర్ మాస్టర్ ఫ్యామిలీకి సోనూసూద్ ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా సోనూసూద్ తన ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు. శివ శంకర్ మాస్టర్ ఫ్యామిలీతో టచ్‌లో ఉన్నానని.. వారిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని.. ఆందోళన అవసరం లేదన్నారు.