శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఎం
Last Modified: సోమవారం, 2 ఆగస్టు 2021 (12:06 IST)

ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించిన సినీ నటుడు సోనూ సూద్.

హైదరాబాద్ లోని విమానాశ్ర యంలో ఆదివారం విఐపి లాంజ్‌లో అనుకోకుండా సినీనటుడు సోనూసూద్‌ను చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కలిశారు. వాళ్లిద్దర మధ్య జరిగిన సంభాషణలో..  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తాను ఫాలో అవుతుంటానని, కరోనా విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలకు, వలస కూలీలకు సకాలంలో సంక్షేమ పథకాలు అందిస్తూ, అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుండడం అభినంద నీయమని సోనూసూద్ అన్నారు.

దేశ వ్యాప్తంగా పేదలకు, వలస కూలీలకు మీరు చేస్తున్న సహాయ కార్యక్రమాలు, సేవా గుణంలో కానీ, ఎక్కడ ఏ ఆపద వచ్చినా స్పందిస్తున్న తీరు , మీరు ఎంచుకున్న సేవా మార్గం స్ఫూర్తిదాయకమంటూ  సోనూసూద్‌ను శ్రీకాంత్ రెడ్డి అభినందించారు.

దేశ వ్యాప్తంగా లభిస్తున్న ఆదరణ  స్ఫూర్తిదాయకంటూ సోనూసూద్‌ను శ్రీకాంత్ రెడ్డి ప్రశంసించారు. మనకున్న దాంట్లో పదిమందికి  సహాయం చేయడం, ఆపదలలో ఉన్నవారిని ఆదుకోవడం, సేవా గుణాన్ని పెంపొందించుకోవడం ఆత్మసంతృప్తిని ఇస్తుందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు