Widgets Magazine

సౌందర్యా రజనీకాంత్‌కు విడాకులు మంజూరు.. ధనుష్ పాత్ర ఎంత?

బుధవారం, 5 జులై 2017 (11:00 IST)

Widgets Magazine
Soundarya - aswin

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ వైవాహిక బంధానికి తెరపడింది. ఆమె తన భర్త నుంచి విడిపోయింది. వీరిద్దరికి మద్రాసు కుటుంబ కోర్టు తాజాగా విడాకులు మంజూరు చేసింది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా పుట్టిన ఏకైక కుమారుడు వేద్‌ను చూసేందుకు ఇరువురికి నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ విషయంలో ఇరువురి మధ్య ఒప్పందం కుదుర్చింది.
 
ప్రముఖ పారిశ్రామికవేత్త అశ్వన్ రాంకుమార్‌తో సౌందర్య ప్రేమలో పడింది. వీరిద్దరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు సమ్మతించడంతో గత 2010 సెప్టెంబర్ 3న వారి వివాహం జరిగింది. అతిరథ మహారధుల సమక్షంలో ఇద్దరూ వైవాహిక బంధంలోకి ప్రవేశించారు. పెళ్లయిన నాలుగేళ్లకు కుమారుడు జన్మించాడు. కొడుక్కి వేద్ అని పేరు పెట్టుకున్నారు. 
 
ఆ తర్వాత వీరి వైవాహిక జీవితంలో మనస్పర్థలు రావడంతో 2016లో వారి వైవాహిక జీవితం కోర్టుకెక్కింది. తొలుత అశ్విన్ రాం కుమార్ విడుకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఇరువైపుల పెద్దలు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రయోజం లేకపోయింది. దీంతో మనస్ఫూర్తిగా విడాకులు తీసుకునేందుకు ఇద్దరూ ప్రయత్నించారు.
 
విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత న్యాయస్థానం వారికి ఏడాది గడువు ఇచ్చింది. విడిపోయి ఎవరికి వారు జీవించేందుకు వారు కోర్టు ఎదుట సుముఖత వ్యక్తం చేశారు. దీంతో అన్ని నిబంధనలను అనుసరించి న్యాయస్థానం ఇద్దరికి విడాకులు మంజూరు చేసింది.
 
ప్రస్తుతం సౌందర్య రజనీకాంత్ వీఐపీ-2 సినిమాతో బిజీగా ఉన్నారు. ధనుష్, అమలాపాల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో ప్రతినాయిక పాత్రను బాలీవుడ్ నటి కాజల్ పోషిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలె విడుదలై సినిమాపై అంచనాలు పెంచుతోంది. 
 
కాగా, రజనీకాంత్ మరో కుమార్తె ఐశ్వర్యను తమిళ హీరో ఐశ్వర్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి కూడా పిల్లలు ఉన్నారు. అయితే, నటి అమలాపాల్ - విజయ్‌లు విడిపోవడానికి ధనుష్ కారణమని కోలీవుడ్ కోడై కూసింది. ఇపుడు అశ్విన్ - సౌందర్యలు కూడా విడిపోవడం వెనుక ధనుష్ పాత్ర ఉందనే విషయంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఎన్టీఆర్‌ను కించపరిచేలా తీస్తే చెప్పుతో కొడతారు.. స్క్రీన్లు చింపేస్తారు: పోసాని

స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత ఆధారంగా తెరకెక్కే చిత్రంలో ఎన్టీఆర్‌ను కించపరిచేలా, అవమానపరిచేలా ...

news

ఎన్టీఆర్‌పై బయోపిక్ తీయాలనే ఆలోచన విరమించుకోండి... ప్లీజ్ : పోసాని

స్వర్గీయ ఎన్టీఆర్‌పై బయోపిక్ తీయాలన్న ఆలోచన విరమించుకోవాలని ప్రముఖ సినీ రచయిత, నటుడు ...

news

సెకండ్ హీరోయిన్ నుంచి ఐటమ్ గర్ల్ దాకా.. పయనం... ఏంటి కేథరిన్ ఇది?

తెలుగు తెరపై అందాల ఆరబోతకు అందరికంటే ముందే సై అనే ఆ ముద్దుగుమ్మకు సుడి బాగా ఉన్నట్లు ...

news

కన్నడ మహాభారత్‌లో ద్రౌపదిగా నయనతార.. ఒప్పుకుంటే పంట పండినట్లే

ఇటీవల తెలుగు దర్శకుడు జక్కన్న చెక్కిన బాహుబలి చిత్రాల సిరీస్‌ ప్రేక్షకులను మెస్మరైజ్‌ ...