శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2015 (13:58 IST)

ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించిన సిమ్రన్: పోలీసాఫీసర్‌గా సెకండ్ ఇన్నింగ్స్!

పెళ్లి చేసేకుని కొన్నేళ్లకు సినీ ఇండస్ట్రీకి దూరమైన అందాల భామ సిమ్రన్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనుంది. వయస్సు నాలుగు పదులు టచ్ చేస్తున్నా.. ఇంకా హీరోయిన్‌గా వెలిగిపోవాలని సిమ్రన్ ఆశిస్తోంది. అయితే ఈ వయసులో సిమ్రన్‌ని హీరోయిన్‌గా పెట్టి మూవీ తీసేందుకు నిర్మాతలు ముందుకురావట్లేదు.

ఈ విషయం తెలుసుకున్న సిమ్రన్ ఓ ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించింది. తాజాగా త్రిష ఇల్లెన్నా నయనతారలో చేసిన క్యారెక్టర్‌కి మంచి స్పందన రావడంతో హీరోయిన్‌గా కెరీర్‌ను కంటిన్యూ చేయాలని నిర్ణయించింది. తన సొంత బ్యానర్‌లో భర్తనే ప్రొడ్యూసర్‌గా చేసి ఓ పోలీస్ స్టోరీ చేసేస్తోంది. అన్నట్లు బుల్లితెరపై కూడా ఓ డ్యాన్స్ రియాల్టీ షోకి జడ్జ్‌గా‌ వ్యవహరించింది. అక్కడ కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. 
 
గ్లామర్ రోల్స్‌తో పెట్టుకోకుండా, లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకులను కట్టిపడేయాలని సిమ్రన్ చూస్తోంది. హిందీలో తాజా రిలీజైన మర్దాని టైప్‌లో ఓ మాంచి స్టోరీ లైన్‌ని గౌరీ శంకర్ అనే డైరక్టప్ వినిచూపించాడట. గతంలో కమర్షియల్ యాడ్స్ చేసిన ఇతగాడు సిమ్రన్ రీఎంట్రీతో దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

నవంబర్‌లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే.. దశాబ్దకాలంపాటు అగ్రహీరోలు అందరి పక్కన అందాలు ఒలకబోసే పాత్రలో చూసి.. ఇప్పుడు ఖాకీ దుస్తుల్లో సిమ్రన్‌ను చూడాలంటే అభిమానులు కాస్త కష్టపడక తప్పదని సినిమా పండితులు అంటున్నారు.