మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 అక్టోబరు 2024 (11:39 IST)

చెర్రీ రా మచ్చా మచ్చా పాటకు సౌత్ కొరియన్ల సూపర్ డ్యాన్స్... (video)

Rapper Aoora
Rapper Aoora
రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్‌లో "గేమ్ ఛేంజర్" పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 10వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన రెండు పాటలకు శ్రోతల నుంచి అద్భుత స్పందన వచ్చింది. 
 
ముఖ్యంగా, రా మచ్చా మచ్చా పాట అయితే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ సాంగ్‌లో చెర్రీ డ్యాన్స్ సింప్లీ సూపర్బ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సంగీత దర్శకుడు తమన్‌తో కలిసి దర్శకుడు శంకర్ ఈ పాటను మరో స్థాయిలీ తీర్చిదిద్దారు. 
 
వెయ్యి మందికిపైగా ఫోక్ డ్యాన్సర్లతో ఈ పాటను స్పెషల్‌గా దర్శకుడు శంకర్ పిక్చరైజ్ చేయించారు. ఇక బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య ఈ పాటకు అద్భుతమైన కొరియోగ్రఫీ అందించారు. దీంతో ఈ పాటపై ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఎన్నో రీల్స్ పుట్టుకొస్తున్నాయి. 
 
మరోవైపు, తాజాగా కొందరు సౌత్ కొరియన్ డాన్సర్లు ఈ పాటకు డ్యాన్స్ చేశారు. ముఖ్యంగా, చెర్రీ డ్యాన్స్ స్టెప్పులను అచ్చుగుద్దినట్టుగా దించేశారు. ఆ వీడియోను సౌత్ కొరియన్ సింగర్, కంపోజర్ పార్క్ మిన్ జూన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దాంతో ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై మెగా అభిమానులు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.