మన్మథుడు సీక్వెల్‌కి అంతా రెడీ... యూరప్‌లోనే...

Last Updated: శుక్రవారం, 25 జనవరి 2019 (11:06 IST)
టాలీవుడ్ మన్మథుడు ప్రస్తుతం మన్మథుడు సీక్వెల్‌కి రెడీ అయిపోతున్నాడు. 2002లో టాలీవుడ్‌లో విడుదలైన మన్మథుడు సినిమా బంపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. నాగ్ కెరీర్‌లోనే ఈ సినిమా చెప్పుకోదగిన సినిమా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతోంది. మార్చి రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 
 
యువ నటుడు.. దర్శకుజు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ ప్రకారం యూరప్‌లో జరుగనుంది. దీంతో రెండు నెలల పాటు నాగ్ యూరప్‌లో మకాం వేయనున్నారు. 
 
ఫిబ్రవరి మూడో వారంలో ఈ సినిమాను ప్రారంభించి.. రెగ్యులర్ షూటింగ్ మార్చి 2 నుంచి ఆరంభించాలని సినీ యూనిట్ భావిస్తోంది. ఇంకా కథానాయికను ఖరారు చేయలేదు. ఈ సినిమా అక్కినేని అభిమానుల అంచనాలకు ధీటుగా తెరకెక్కుతోందని సమాచారం. దీనిపై మరింత చదవండి :