Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కోటి రూపాయల సెట్.. 80 మంది డ్యాన్సర్లతో చిందులేయనున్న స్పైడర్‌

శనివారం, 1 జులై 2017 (13:34 IST)

Widgets Magazine

బ్రహ్మోత్సవం ఫట్ అయ్యాక టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.. స్పైడర్‌తో ముందుకు రాబోతున్నారు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న స్పైడ‌ర్ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి హ‌రీష్ జై రాజ్ సంగీతం అందిస్తున్నాడు. ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, ఎస్ జె సూర్య విల‌న్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా హిట్ కొట్టాలని మహేష్ ఉవ్విళ్లూరుతున్నాడు. తమిళంలోనూ మాస్ హీరో అయిపోవాలనుకుంటున్నాడు.
 
తాజాగా మహేష్-మురగదాస్ సినిమా షూటింగ్‌ పూర్తైనా.. ఇంకా రెండు పాటలు మిగిలిపోయాయి. ఈ పాటలతో పాటు టాకీ పార్ట్‌ను పూర్తి చేసేందుకు మహేష్ బాబు మురుగదాస్ టీమ్‌తో వచ్చేవారంలో కలవనున్నాడు. జూలై నాలుగో తేదీ నుంచి ప్రారంభం కానున్న స్పైడర్ సాంగ్ చిత్రీకరణ.. అన్న‌పూర్ణ సెవెన్ ఎకర్స్ స్టూడియోలో జరుగనుంది. ఇందుకోసం కోటి రూపాయల ఖర్చుతో అద్భుతమైన సెట్ వేశారు. 
 
ఈ పాటకు సోభి కొరియోగ్రాఫ్ చేయ‌నుండ‌గా, ఇందులో మ‌హేష్‌తో కలిసి 80 మంది డ్యాన్స‌ర్స్ పాల్గొంటారట. ఇక మ‌రో సాంగ్‌ని ఆగ‌స్టులో షూట్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, సినిమాని సెప్టెంబ‌ర్ 27న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మహేష్.. కాస్త గ్యాప్ తీసుకుని స్పైడర్ పాటల షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాబీపై అసహనం వ్యక్తం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్ తాజాగా బాబీ దర్శకత్వంలో జై లవకుశ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ...

news

బరువు తగ్గడానికి తీసుకున్న చికిత్సే దాసరి ప్రాణాలు తీసింది: రేలంగి

దర్శకరత్న దాసరి నారాయణ రావు మృతి పట్ల సీనియర్ డైరక్టర్ రేలంగి నరసింహారావు స్పందించారు. ...

news

పవన్‌కు అందమైన భార్య... చక్కని కుమార్తె ఉంది.. ప్లీజ్ అర్థం చేసుకోండి : రేణూ దేశాయి

జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు, తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ గురించి రేణూ దేశాయ్ మరోమారు ...

news

అనుష్క ఎక్కడ ఇబ్బంది పడుతోందో అక్కడే మేలుకున్నా.. కీర్తి సంబరం

అప్పటికీ, ఇప్పటికీ, ఇప్పటికీ దక్షిణాది ఎవర్ గ్రీన్ హీరోయిన్ సావిత్రి పాత్రను పోషించే ...

Widgets Magazine