స్పైడర్ టీజర్: పోకిరిని తలపించిన ప్రిన్స్ స్టైల్.. భయపెట్టడం మాకూ తెలుసు..(వీడియో)

బుధవారం, 9 ఆగస్టు 2017 (12:26 IST)

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, ఏఆర్ మురుగదాస్ కాంబో వస్తున్న స్పైడర్ సినిమాపై అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఆగస్ట్‌ 9 మహేష్‌ పుట్టినరోజు సందర్భంగా 'స్పైడర్‌' కొత్త టీజర్‌ను విడుదల చేశారు. దీంతో ప్రిన్స్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ స్పైడర్ టీజర్లో మహేష్ బాబు స్టైల్ లుక్ అదిరిపోవడం, యాక్షన్ సీన్లతో పోకిరిని తలపించాడు.
 
ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న స్పైడర్‌లో మహేష్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్‌, రకుల్ జర్నలిస్టుగా కనిపిస్తున్నారు. ప్రజల ప్రాణాలు బలిగొనే ఓ రాక్షసుడిని పనిపట్టే పాత్రలో మహేష్ బాబు కనిపిస్తారని టీజర్‌ని చూస్తే తెలుస్తోంది. 
 
ఈ చిత్రంలో విలన్ పాత్రలో ఎస్.జె సూర్య నటిస్తున్నారు. ఇక రకుల్ ప్రిన్స్‌తో రొమాన్స్ అదరగొట్టేసింది. ఇంకా ఆ రోజు అంతమంది జనాభాలో దాక్కున్నావే అదే భయం.. భయపెట్టడం మాకు తెలుసు అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ అదిరింది. ఇక ఈ సినిమాకు చెందిన అన్నీ పనులు పూర్తి చేసి దసరా కానుకగా సెప్టెంబర్‌ 27న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా 'స్పైడర్‌' చిత్రాన్ని విడుదల చేసేందుకు యూనిట్ రెడీ అవుతోంది.
 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

జైలులో దిలీప్‌ నిద్రలేని రాత్రులు.. ఆగస్టు 22 వరకు కస్టడీ పొడిగింపు.. 15 తోటి ఖైదీలతోనే?

ప్రముఖ నటి భావన లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన కేసులో జైలులో ఉన్న స్టార్ హీరో దిలీప్.. ...

news

బ్రూనా అందాలు అదరహో: హాట్ ఫోటోలు.. ఇంటర్నెట్‌లో వైరల్..

అందాలను ఆరబోయడంలో ఈ మధ్య హీరోయిన్లు ఏమాత్రం వెనుకడుగు వేయట్లేదు. ఈ మధ్య కొందరు హీరోయిన్లు ...

news

పవన్ కల్యాణ్ కోసమే ఫిదా రాసుకున్నా.. షాడోలా వెనక నుంచి నడిపించాడు..

జనసేన పార్టీ నేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం ఫిదా స్టోరీ రాసుకున్నట్లు శేఖర్ కమ్ముల ...

news

ప్రేమలో మీ లావణ్య త్రిపాఠి... బడా నిర్మాత తనయుడితో...

నటి లావణ్య త్రిపాఠి ప్రేమలో పడిందట. అది కూడా ఒక బడా నిర్మాత కొడుకుతో. ఇప్పటికే ఈ విషయం ...