ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 8 ఏప్రియల్ 2018 (10:55 IST)

శ్రీరెడ్డి.. ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్ధనగ్న నిరసన.. ఇంటి ఓనర్ ఏమన్నారో తెలుసా?

శ్రీ లీక్స్ పేరిట టాలీవుడ్‌లో పెనుదుమారం రేపిన శ్రీరెడ్డి.. శనివారం ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్ధనగ్నంగా నిరసన తెలిపింది. ఈ ఘటన టాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో అర్ధనగ్నంగా ఫిలిమ్ ఛాంబర్ ముందు

శ్రీ లీక్స్ పేరిట టాలీవుడ్‌లో పెనుదుమారం రేపిన శ్రీరెడ్డి.. శనివారం ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్ధనగ్నంగా నిరసన తెలిపింది. ఈ ఘటన టాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో అర్ధనగ్నంగా ఫిలిమ్ ఛాంబర్ ముందు నిరసన తెలిపిన కారణంగా ఇంటి ఓనర్ వెంటనే ఇల్లు ఖాళీ చేయమని చెప్పేశారని శ్రీరెడ్డి తెలిపింది. తక్షణం ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశించారని శ్రీరెడ్డి వాపోయింది. 
 
ఇంటి యజమాని ఓ ఐఏఎస్ ఆఫీసరని.. ఆయన ఎంతటి ఉన్నత పదవిలో వున్నప్పటికీ.. అల్పబుద్ధితో ఇల్లు ఖాళీ చేయమన్నారని శ్రీరెడ్డి తెలిపింది. ఎంత గొప్ప ప్రజలో అంటూ ఆదివారం ఎఫ్‌బీలో శ్రీరెడ్డి పోస్టు పెట్టింది. 
 
అంతకుముందు "అక్కా నువ్వు మంచి డాన్ అంట. ఎవరినైనా గోడౌన్స్‌లో వేసి కుమ్మిస్తావంట. అంకుల్స్ అందరికీ చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తావంట. నా జోలికి రాకు అక్కోయ్" అని మరో పోస్టు పెట్టింది. ఈ వ్యాఖ్యలు శ్రీరెడ్డి ఎవరిని ఉద్దేశించి చేసిందని మాత్రం ఆమె చెప్పలేదు. దీంతో ఈ వ్యక్తి ఎవరనేదానిపై చర్చ జరుగుతోంది.
 
కాగా.. నటి శ్రీరెడ్డి శనివారం హైదరాబాద్‌లో ఫిల్మ్ ఛాంబర్ వద్ద అర్ధనగ్నంగా నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన ఛాంబర్ సభ్యులు ఆమెతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించారు. ఇందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అయితే, తాను ఇంతటితో ఆగబోనని తన డిమాండ్లు తీర్చే వరకు నిరాహార దీక్ష చేస్తానని శ్రీరెడ్డి శపథం చేసింది.