అరే నానిగా.. ఈ వీడియో నీకు అంకితం.. #SriReddy #Hip వీడియో వైరల్..
కోలీవుడ్, టాలీవుడ్‌లోని పలువురు దర్శకులపై లైంగిక ఆరోపణలు చేస్తూ.. అర్ధనగ్న పోరాటం చేసిన శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌లో పలువురు దర్శకులపై వరుసగా లైంగిక ఆరోపణలు చేస్తూ వచ్చిన శ్రీరెడ్డి.. సినీ హీరో నానిపై కూడా కామెంట్స్ చేసింది. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో రోజూ వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డికి టాలీవుడ్ పక్కనబెట్టేసింది.
ఇక వేరేదారి లేక కోలీవుడ్‌కు శ్రీరెడ్డి మకాం మార్చింది. ఈ నేపథ్యంలో మళ్లీ జెర్సీ హీరో నానిపై శ్రీరెడ్డి మండిపడింది. నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్-2లో శ్రీరెడ్డి పాల్గొనాల్సింది. కానీ నాని శ్రీరెడ్డి పాలు పంచుకుంటే ఆ షోకు తాను వ్యాఖ్యాతగా వ్యవహరించబోనని తేల్చి చెప్పేశాడు. ఈ కారణంగా శ్రీరెడ్డి బిగ్‌బాస్-2లో పాల్గొనలేకపోయింది.
ఇలాంటి తరుణంలో నానిపై మళ్లీ విమర్శలు గుప్పిస్తూ.. నానికి టిక్ టాక్ వీడియోను అంకితం చేసింది. పడకగదిలో అభ్యంతరకరమైన రీతిలో నడుమును చూపెట్టిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యింది. ''అరే నానిగా.. ఈ వీడియో నీకు అంకితం ఇస్తున్నానని #SriReddy #Hip'' అంటూ రెండు హ్యాష్ ట్యాగులను కూడా జతచేసింది.