మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 మార్చి 2021 (10:18 IST)

ప్రభాస్‌పై పడిన శ్రీరెడ్డి.. సలార్ గురించి ఏమన్నదో తెలుసా?

వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ వుంటుంది. ఎప్పుడూ ఎవరో ఒకరి మీద సెన్సేషనల్ కామెంట్లు చేస్తూనే వుంటుంది. ఇటీవలే విశాల్ గురించి నెగటివ్‌గా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. విశాల్ డౌన్ ఫాల్ మొదలైంది అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది.
 
అయితే ఇప్పుడు ఈ అమ్మడు రెబెల్ స్టార్ ప్రభాస్ గురించి కామెంట్స్ చేసింది. అయితే ఇందులో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభాస్ గురించి పాజిటివ్‌గానే మాట్లాడింది. రీసెంట్‌గా ప్రభాస్ సలార్ పోస్టర్ విడుదలైన సంగతి తెల్సిందే. 
salaar movie still
 
ఫుల్ మాస్ గెటప్‌లో ఉన్న పోస్టర్‌ను విడుదల చేసారు. దాంతో పాటు సలార్ విడుదల తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 14, 2022న సలార్ విడుదల కానుంది. అయితే ప్రభాస్ బాడీ గురించి, ''వామ్మో, సలార్‌లో ఆ బాడీ ఏంట్రా బాబు, పోస్టర్ లోనే ఇలా ఉంటే ఇక సినిమాలో ఎలా ఉంటుందో" అని శ్రీరెడ్డి అంటోంది.