శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 15 నవంబరు 2022 (18:21 IST)

సూపర్ స్టార్ కృష్ణ వ్యక్తిత్యం గురించి శ్రీశ్రీ పలుకులు

srisri-rajkumar
srisri-rajkumar
నేను ఒక అక్షరం రాసినా దానికి కూడా విలువ కట్టి పారితోషికం ఇచ్చిన ఏకైక వ్యక్తి కృష్ణ అని మహాకవి శ్రీశ్రీ గారు చెప్పారు. దానిని ఓ పత్రిక 1994లో ప్రచురించింది. కృష్ణ గారు శ్రీ శ్రీ గారికి వీరాభిమాని. మహా ప్రస్థానం బాగా చదివారు. అందుకే ఈనాడు సినిమాలో శ్రీశ్రీ రాసిన కదలిరండి మనుషులైతే అనే పాటతో పాటు పలు చైతన్య గీతాలు గీత రచయిత చేత సందర్భానుసారంగా రాయించారు కృష్ణ గారు. అప్పట్లో కన్నడ కంఠీరవ అంటే కృష్ణగారు అభిమానించేవారు.
 
సూపర్ స్టార్ కృష్ణ కి ప్రజానాట్యమండలి నివాళులు
సినిమా పరిశ్రమలో దాదాపుగా మూడు దశాబ్దాల పాటు అనేక అభ్యుదయ, జానపద, సాంఘీక, కౌబాయ్ సినిమాలకు ఒక ఒరవడి సృష్టించి సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గా ఎదిగారు... నటునిగా ఆరంభంలో కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ ప్రజానాట్యమండలిలో డాక్టర్ గరికపాటి రాజారావు నాయకత్వంలో చైర్మన్ తదితర నాటకాలలో నటించి తన నటనకు మెరుగులు దిద్దుకున్నారు. ఆ తర్వాత సినిమా రంగంలో తను నిర్మించిన ప్రతీ సినిమాని కూడా సినిమా స్కోప్, 70 ఏం ఎం లాంటి నూతన సాంకేతిక వ్యవస్థ ఉండేటట్లుగా రూపొందించేవారు. ప్రజానాట్యమండలి సభ్యుడు అయిన మాధవరావు గార్ని తన జీవితాంతం మేకప్ మాన్ ఉంచుకొన్నారు, డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న కృష్ణ కు సినిమా ప్రజానాట్యమండలి తరపున వందేమాతరం శ్రీనివాస్, మద్దినేని రమేష్ బాబు, డాక్టర్ మాదాల రవి లు ప్రగాఢ సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేసారు.