Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాహుబలిని తలపిస్తున్న శ్రుతిహాసన్‌ ‘సంగమిత్ర’ ఫస్ట్‌లుక్‌

హైదరాబాద్, శుక్రవారం, 19 మే 2017 (08:15 IST)

Widgets Magazine

ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి. రూపొందిస్తున్న సినిమా ఫస్ట్‌లుక్ నిజం చెప్పాలంటే మతి పోగొడుతోంది. గురువారం చిత్రబృందం విడుదల చేసిన సినిమా పస్ట్‌లుక్  చూస్తుంటే భారతీయ సినిమాపై బాహుబలి వేసిన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇకపై భారతీయ సినీ పరిశ్రమ ఏ సినిమా తీయాలన్నీ, ప్రత్యేకించి చారిత్రక, పౌరాణిక, ఫాంటసీ చిత్రాలు తీయాలంటే బాహుబలి 2 ని దృష్టిలో పెట్టుకుని కాస్త భయంతోనే వ్యవహరించాలని సంఘమిత్ర ఫస్ట్ లుక్ తేల్చి చెబుతోంది. సంగమిత్ర పాత్రధారి శ్రుతిహసన్ ఈ ఫస్ట్ లుక్‌లో మెరుపులా మెరుస్తోందంటే అతిశయోక్తి కాదు. 
hansika-sruthi hassan
 
ఒక సినిమా సాధించిన అఖండ విజయాన్ని గౌరవించాలంటే ఆ సినిమాతో పోటీ పడే శక్తిని, స్థాయిని ప్రదర్శించాల్సిందే అన్న సత్యాన్ని గుర్తు చేస్తూ సంగమిత్ర దర్శకుడు సుందర్ సి. అద్భుతరీతిలో ఫస్ట్ లుక్‌ను రూపొందించారు. బాహుబలి బాలీవుడ్ సమర్పకుడు కరణ్ జోహార్ నెల క్రితం చెప్పిన విషయం ఇదే. భారతీయ సినిమాకు బాహుబలి-2 కొత్త విజన్‌ని ఇస్తోందని కరణ్ అన్న మాట అక్షరసత్యంగా సంగమిత్ర ఫస్ట్ లుక్ ద్వారా  కనబడుతోంది.
 
సుందర్ సి ప్రతిష్టాత్మకంగా తీస్తున్న చారిత్రక చిత్రం సంగమిత్ర విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఎందుకంటే అది బాహుబలి సృష్టించిన దార్శనికత నుంచి పుట్టుకొచ్చిన మొదటి చిత్రం. అఖండ విజయమే దానికి అర్హమైన గౌరవం.
 
శ్రుతి హాసన్‌ ప్రధాన పాత్రలో తమిళ దర్శకుడు సుందర్‌.సి రూపొందిస్తున్న చిత్రం ‘సంగమిత్ర’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం గురువారం విడుదల చేసింది. త్రెండాల్‌ ఫిల్మ్స్‌ దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ యువరాణి పాత్రలో కన్పించనుంది. ఇందుకోసం ఆమె ఇటీవల కత్తిసాములో సైతం శిక్షణ తీసుకుంటోంది. ఇక ఈ సినిమాలో ఆర్య, జయం రవి కూడా నటిస్తున్నారు. 
 
ఈ చిత్రం ‘బాహుబలి’ తరహాలో రెండు భాగాలుగా రూపొందిస్తారని సమాచారం. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాను తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించబోతున్నారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

‘సాహోరే బాహుబలి’ పూర్తి వీడియో యూట్యూబ్‌లో విడుదల. మతిపోగుడుతోన్న విజువల్ వండర్

అద్భుతం, మహాద్భుతం, కమనీయం వంటి భాషలోని పదాలన్నీ వర్ణించినా బాహుబలి2 లోని ఆ పాట ...

news

అవకాశాలివ్వకపోతే భాషతో కొడతాను అంటున్న రాశీఖన్నా.. కోలీవుడ్‌లో వేషం దొరికిందట

ఉత్తరాది నుంచి దక్షిణాదికి వలస వస్తున్న భామలు ఇక్కడ అవకాశాలు రావాలంటే ముందుగా ప్రాంతీయ ...

news

నాది, నాగచెతన్యది దేవుడు పుట్టించిన ప్రేమ: సమంత ఉద్వేగం

యువ నటుడు నాగచైతన్య ప్రేమలో మునిగి తేలుతున్న సమంత త్వరలో ఆయనతో ఏడడుగులు వేయడానికి సిద్ధం ...

news

విజయ్‌ సినిమాకు వందకోట్ల బడ్జెట్టా... ఇదేం తెలుగు సినిమానా.. తప్పుకున్న లైకా..

తమిళ చిత్ర సీమలో రజనీ, కమల్ ప్రాభవం తగ్గిన నేపధ్యంలో చొచ్చుకువచ్చి పాతుకుపోయిన కొద్దిమంది ...

Widgets Magazine