శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 ఫిబ్రవరి 2023 (12:14 IST)

ఒకేసారి నాలుగు.. ఆర్ఆర్ఆర్ అవార్డుల పంట.. జక్కన్న హర్షం (video)

RRR
RRR
ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అవార్డుల పంట పడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ సినిమాను ఇప్పుడు మరో 4 అంతర్జాతీయ అవార్డులు వరించాయి.
 
అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా నాలుగు కేటగిరీల్లో ఆర్ఆర్ఆర్ సినిమా అవార్డులను సొంతం చేసుకుంది. ఏకంగా ఒకేసారి నాలుగు అవార్డులను అందుకున్న తొలి భారతీయ సినిమాగా ఆర్ఆర్ఆర్ రికార్డు సృష్టించింది.  
 
బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం, బెస్ట్‌ యాక్షన్‌ ఫిలిం, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌, బెస్ట్‌ స్టంట్స్‌ కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు హెచ్‌సీఏ అవార్డులు వరించాయి. రాజమౌళి, కీరవాణి, రామ్‌చరణ్‌ ఈ అవార్డులను అందుకున్నారు. 
 
అవార్డు అందుకున్న సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. హెచ్‌సీఏకు ధన్యవాదాలు తెలిపారు. మామూవీలో స్టంట్స్ గుర్తించి అవార్డు ఇవ్వడంపై జక్కన్న హర్షం వ్యక్తం చేశారు. స్టంట్స్ కోసం సాల్మన్ బాగా కష్టపడ్డాడు. క్లైమాక్స్ యాక్షన్ కోసం జూజీ సాయం చేశారని.. హీరోస్ చెర్రీ, ఎన్టీఆర్ బాగా చేశారని.. అందరికీ థ్యాంక్స్ అంటూ చెప్పారు. 
RRR
RRR
 
320 రోజుల టీమ్ సమిష్టి కృషితో ఈ సినిమా క్లైమాక్స్ తెరకెక్కిందని.. ఇక మా ఇండియా ఎన్నో కథలకు నిలయం.. భారత దేశం నుంచి అద్భుతమైన కథలు పుడతాయి అని అంటూ… మేరా భారత్ మహాన్ అంటూ రాజమౌళి ముగించారు.