శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 1 అక్టోబరు 2016 (14:10 IST)

కన్ఫర్మ్... బాహుబలి 3 ఉంది... మరి తెలుగోళ్లకి '3' చూసే ఓపిక ఉంటుందా...?!!

బాహుబలి ఫీవర్ అలానే కొనసాగించాలనుకుంటున్నాడు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పటివరకూ 1,2,3 పార్టులంటూ హాలీవుడ్ సినిమాలను తీయడం చూశాం. ఐతే తెలుగులో అలాంటి ఫార్ములాను ఫాలో అయ్యేందుకు ఎవ్వరూ సాహసం చేయలేదు. కానీ రాజమౌళి మాత్రం ఆ సాహసం చేసేశారు. నిజానికి

బాహుబలి ఫీవర్ అలానే కొనసాగించాలనుకుంటున్నాడు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పటివరకూ 1,2,3 పార్టులంటూ హాలీవుడ్ సినిమాలను తీయడం చూశాం. ఐతే తెలుగులో అలాంటి ఫార్ములాను ఫాలో అయ్యేందుకు ఎవ్వరూ సాహసం చేయలేదు. కానీ రాజమౌళి మాత్రం ఆ సాహసం చేసేశారు. నిజానికి బాహుబలి చిత్రాన్ని ఒక పార్టుగానే అనుకున్నప్పటికీ జక్కన్న ప్రతి సీనును చెక్కడంతో అది కాస్తా రెండో పార్టుకు వెళ్లింది. 
 
ఇప్పుడిక రెండో పార్టు తీసిన రాజమౌళికి మాహిష్మతి సామ్రాజ్యం మరీ పెద్దది కనుక అందలి పాత్రలు ఎక్కువైపోయాయట. అందువల్ల 3వ పార్టు వరకూ వెళ్లిందని చెపుతున్నారు. కాబట్టి బాహుబలి 3 పార్టు కూడా ఉన్నట్లు సెలవిచ్చారు. బాహుబలి బిగినింగ్ చిత్రంలో ఉన్న టెంపోను రెండో పార్టుకు తీసుకువచ్చాడు రాజమౌళి. 
 
ఇప్పుడు బాహుబలి 2 కంక్లూజన్ కాకుండా బాహుబలి 3 వరకూ తీసుకెళ్లాలని తేల్చే చెప్పారు. ఆ తర్వాత బాహుబలి 4, 5... అలా హారిపోటర్ మాదిరిగా సాగుతుందేమో చూద్దాం. మరి మాహిష్మతి రాజ్యంలో అన్ని కోణాలను పాత్రలను చూపించుకుంటూ వెళ్లాలనుకున్న రాజమౌళి బాహుబలి 3 చిత్రాన్ని చూసే ఓపిక తెలుగు ప్రేక్షకులు ఉందో లేదో బాహుబలి 2 మీద ఆధారపడి ఉంది.